New Delhi, AUG 28: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ (Virat kohli) ఆదివారంతో మరో రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటికే కొహ్లీ 102 టెస్టు మ్యాచులు, 262 వన్డే మ్యాచులు.. అలాగే, 99 టీ20 మ్యాచులు ఆడాడు. రేపు ఆసియా కప్ (Asia Cup) లో భాగంగా భారత్-పాకిస్థాన్ (India Pakistan Match) తలబడనున్నాయి. దుబాయిలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తారు. రేపటితో కొహ్లీ 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ గా నిలవనున్నాడు. అంతేకాదు, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు. ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్‌కు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. అయితే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్‌తో ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు.
విరాట్ కొహ్లీ 2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన మ్యాచుతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టీమిండియాలో తనదైన ముద్ర వేసుకుని ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 99 టీ20ల్లో 50.12 యావరేజ్ తో, కొహ్లీ 3,308 పరుగులు చేశాడు. టీ20ల్లో అతడి బెస్ట్ స్కోర్ 94. ఈ ఫార్మాట్ లో మొత్తం 30 అర్ధ సెంచరీలు బాదాడు. కొంత కాలంగా కొహ్లీ (Kohli)మెరుగైన ఆటతీరును కనబర్చడం లేదు.
Asia Cup 2022: ఉత్కంఠ రేపుతున్న దాయాదితో పోరు,ఈ నెల 28న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్
రేపటి మ్యాచుతోనైనా మళ్ళీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఆసియా కప్ ను టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది. దుబాయి, షార్జాలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది