Asia Cup 2023: పాకిస్థాన్ చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం.. వేరే చోటికి తరలించాలని ఏసీసీ నిర్ణయం.. శ్రీలంకలో నిర్వహించే చాన్స్.. నేడు తుది ప్రకటన వెలువడే అవకాశం
ఆసియాకప్ (Asia Cup) ఆతిథ్యాన్ని పాకిస్థాన్ కోల్పోయింది. దీనిని వేరే చోటికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ-ACC) నిర్ణయించింది.
Newdelhi, May 9: ఊహించిందే జరిగింది. ఆసియాకప్ (Asia Cup) ఆతిథ్యాన్ని పాకిస్థాన్ కోల్పోయింది. దీనిని వేరే చోటికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ-ACC) నిర్ణయించింది. దీంతో ఆసియాకప్‌ను ఇప్పుడు శ్రీలంకలో (Srilanka) నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, నేడు జరిగే రెండో విడత చర్చల్లో ఏసీసీ తన మనసు మార్చుకుంటుందేమోనని పాక్ బోర్డు (Pak Board) ఆశగా ఉంది.
అందుకే నీలినీడలు
నిజానికి ఈ ఏడాది ఆసియాకప్‌ను పాకిస్థాన్ నిర్వహించాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు తమ జట్టును పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి పాక్ లో ఆసియాకప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి