Asia Cup 2023 Tournament: ఇవాల్టి నుంచే ఆసియాకప్ సమరం, ఫస్ట్ మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్- నేపాల్, ఇంతకీ భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ తెలుసా?
ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ (Asia Cup 2023 Tournament) జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – నేపాల్ జట్ల (Pakistan Vs Nepal) మధ్య సాయంత్రం 3గంటలకు జరుగుతుంది.
Multan, AUG 30: ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ICC World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ (Asia Cup 2023 Tournament) జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – నేపాల్ జట్ల (Pakistan Vs Nepal) మధ్య సాయంత్రం 3గంటలకు జరుగుతుంది. ఈ టోర్నీలో సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం ఆరు టీంలు పాల్గొంటుండగా.. 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఆసియా కప్ -2023కు (Asia Cup 2023 Tournament) పాకిస్థాన్ ఆతిధ్యమిస్తుంది. దీంతో పాకిస్థాన్ లోని ముల్తాన్ వేదికగా టోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ -ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు, గ్రూప్ – బిలో ఆప్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. పాకిస్థాన్ మైదానాల్లో టీమిండియా ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో ఈసారి హైబ్రీడ్ మోడల్‌లో టోర్నీ జరుగుతుంది.
మొత్తం మ్యాచ్‌లలో పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగతా తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్ లు వారి సొంతగడ్డపై జరగనుండగా, భారత్ ఆడబోయే మ్యాచ్ లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం పాకిస్థాన్ – నేపాల్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అంతుముందు పాకిస్థాన్ లోని ముల్తాన్ వేదికగా టోర్నీఆరంభం వేడుక జరుగుతుంది. అయితే, ఈ ఆరంభ వేడుకకు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రెసిడెంట్ జకా అష్రాఫ్ వెల్లడించారు. అయితే, బీసీసీఐ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. అంతేకాకుండా సూపర్-4 దశలోనూ ఒక్కో జట్టు మిగతా టీంలతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో ఈ టోర్నీలో రెండుసార్లు ఇరుజట్లు తలపడే అవకాశం ఉంది. ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే క్రికెట్ ప్రియులు పండగేనని చెప్పొచ్చు.
Asia Cup 2023: టీమిండియాకు షాక్, ఆసియా కప్ 2023 తొలి రెండు మ్యాచ్‌లకి కేఎల్ రాహుల్ దూరం
శ్రీలంక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ -2023 టోర్నీలో బరిలోకి దిగబోతుంది. గతసారి జరిగిన టోర్నీలో ఫైనల్ లో పాకిస్థాన్ జట్టును ఓడించి శ్రీలంక విజయం సాధించింది. గత ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు ఫైనల్ కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈసారి ఆసియా కప్ తో భారత్ తిరిగి వస్తామని టీమిండియా క్రికెటర్లు దీమాతో ఉన్నారు.