T20 World Cup 2021: ఆరు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా, 8 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు, బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరూన్ ఫించ్
ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి 6.2 ఓవర్లలో మ్యాచ్‌ను (Australia Clinch Dominant Win Over Bangladesh) ముగించేసింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి 6.2 ఓవర్లలో మ్యాచ్‌ను (Australia Clinch Dominant Win Over Bangladesh) ముగించేసింది.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు విధించిన 74 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 6.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి (AUS vs BAN Highlights of T20 World Cup 2021 Match) చేధించింది. ఆరంభంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ పరుగుల వరద పారించారు. బంగ్లాదేశ్ బౌలర్లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 15 ఓవర్లకే ఆల్ అవుట్ అయి కేవలం 73 పరుగులే చేసి.. ఆస్ట్రేలియాకు 74 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరూన్ ఫించ్ ఇద్దరే ఆస్ట్రేలియాను గెలిపించారు. డేవిడ్ వార్నర్ 14 బంతుల్లో 18 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫించ్… 20 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే.. ఇద్దరూ పెవిలియన్ చేరడంతో.. మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇద్దరూ బరిలోకి దిగారు. అందులో మార్ష్ 5 బంతుల్లో 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, ఇస్లామ్.. ఒక్కో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 4 ఓవర్లు వేసిన జంపా బంగ్లాదేశ్ కీలక వికెట్లు 5 తీసి.. కేవలం 19 పరుగులే అందించాడు.
బంగ్లాదేశ్ ఆటగాళ్లలో షామిమ్ 18 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మహమ్మద్ నయిమ్ 16 బంతుల్లో 17 పరుగులు చేశాడు. మహ్మదుల్లా(కెప్టెన్) 18 బంతుల్లో 16 పరుగులు చేశాడు. మిగితా ఆటగాళ్లంతా 10 లోపే స్కోర్ చేసి పెవిలియన్ చేరారు. దీంతో 15 ఓవర్లకే బంగ్లా.. తన ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది.