Kabul Premier League: ఒక్క ఓవర్‌లో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్, కాబూల్ ప్రీమియర్‌ లీగ్‌లో యువ బ్యాట్స్‌మెన్ సంచలనం

2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) తరహాలో ఓ యువ ఆటగాడు చెలరేగిపోయాడు. యూవీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగా.. ఇత‌ను ఏకంగా ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు.

Kabul Premier League (PIC@Twitter)

Kabul, July 29: అఫ్గానిస్థాన్‌లో జ‌రుగుతున్న‌ కాబూల్‌ ప్రీమియర్‌ లీగ్‌(Kabul Premier League)లో సంచలనం న‌మోదైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) తరహాలో ఓ యువ ఆటగాడు చెలరేగిపోయాడు. యూవీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగా.. ఇత‌ను ఏకంగా ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు ఓ ఫోర్‌ కూడా ఉండటంతో ఆ ఓవర్‌లో ఏకంగా 49 పరుగులు వచ్చాయి. ఈ అరుదైన ఫీట్‌కు కాబూల్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేదికైంది. లీగ్‌లో భాగంగా శనివారం షాహీన్‌ హంటర్స్‌ (Shaheen Hunters), అబాసిన్‌ డిఫెండర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. షాహీన్‌ హంటర్స్‌ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సాదిఖుల్లా అటల్ (Sediqullah Atal) సంచనల ఇన్నింగ్స్‌తో విశ్వరూపం కనబరిచాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన షాహీన్‌ హంటర్స్‌.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. 18 ఓవర్లలో 158/6తో ఉన్న షాహీన్‌ హంటర్స్‌కు సాదిఖుల్లా అదిరిపోయే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. అమీర్‌ జజాయ్‌(Amir Zazai) వేసిన 19వ ఓవలో సాధిఖుల్లా చరిత్ర సృష్టించాడు. వరుసగా 7+నోబ్‌, 5+వైడ్‌, 6, 6, 6, 6, 6, 6 బాదాడు. ఫలితంగా ఓకే ఓవర్‌లో షాహీన్‌ హంటర్స్‌ ఖాతాలో 48 పరుగులు చేరాయి.

India Vs West Indies 1st ODI: భారత్‌-వెస్టిండిస్ వన్డే సమరం షురూ! వరల్డ్ కప్‌ ఎంట్రీ దక్కకపోవడంతో కసిమీదున్న వెస్టిండిస్, క్లీన్ స్వీప్ చేస్తామంటున్న రోహిత్ సేన 

మొత్తంగా ఈ మ్యాచ్‌లో సాధిఖుల్లా 56 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేయడం విశేషం. అనంతరం లక్ష్యఛేదనలో అబాసిన్‌ డిఫెండర్స్‌(Abasin Defenders) 18.3 ఓవర్లలో 121 పరుగులకే కుప్పుకూలి.. 92 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అజేయ సెంచరీతో చెలరేగిన సాదిఖుల్లా ‘ప్లేయ‌ర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు.