Barbados, July 27: భారత్, వెస్టిండీస్ జట్ల (India Vs West Indies) మధ్య వన్డే సమరం ఈరోజు నుంచి ప్రారంభంకానుంది. మూడు వన్డే మ్యాచ్ ల (ODI Series) సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7గంటలకు బార్బడోస్‌లో (India Vs West Indies) కెన్సింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో (1st Odi Match)భాగంగా ఇండియా, విండీస్ జట్లు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాయి. 1-0 తో భారత్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో టెస్టు చివరి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కావడంతో క్లీన్‌స్వీప్ నుంచి వెస్టిండీస్ జట్టు తప్పించుకున్నట్లయింది. నేటినుంచి జరిగే వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లను గెలుచుకొని వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే, వన్డే జట్టు విషయానికి వస్తే వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతంగా ఉందనే చెప్పొచ్చు.
ODI 𝙍𝙀𝘼𝘿𝙔! 👌 👌#TeamIndia | #WIvIND pic.twitter.com/tYf0wGq7tR
— BCCI (@BCCI) July 26, 2023
టెస్టులతో పోలిస్తే వన్డేల్లో విండీస్ జట్టు గట్టిపోటీ ఇస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ జట్టులో మెరుపు బ్యాటింగ్‌తో భారీ స్కోర్ సాధించగలిగే బ్యాటర్లు ఉన్నారు. ఇటీవల ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన కైల్ మేయర్స్ తో పాటు అతడి ఓపెనింగ్ భాగస్వామి బ్రెండర్ కింగ్ కూడా దూకుడైన బ్యాటింగ్ చేస్తాడు. కెప్టెన్, వికెట్ కీపర్ షై హోప్ కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. మరోవైపు హెట్ మయర్, ఆల్ రౌండర్లు రోమన్ పావెల్, రోమారియో షెఫర్డ్ లు రాణిస్తే భారత్ బౌలర్లకు కష్టాలు తప్పవు. వారిని కట్టడిచేసేందుకు భారత్ బౌలింగ్‌త్రయం పక్కా వ్యూహంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. విండీస్ జట్టులో ఫేస్ బౌలర్ అల్జారి జోసెఫ్‌తో భారత్ బ్యాటర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందేనని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
#TeamIndia Captain @ImRo45 on the importance of West Indies series 🔽#WIvIND pic.twitter.com/hSDjubcSNr
— BCCI (@BCCI) July 26, 2023
భారత్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే.. భారీ స్కోర్ చేయగల సత్తాఉన్న బ్యాటర్లకు టీమిండియా జట్టులో కొదవలేదని చెప్పొచ్చు. అవకాశం వస్తే విరుచుకుపడేందుకు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. అయితే, జట్టులో స్థానంకోసం యువ క్రికెటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్ తో పాటు సంజు శాంసన్ పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విభాగంలో తుది జట్టులో షమి, బుమ్రా ప్రపంచకప్ ఆడటంపై సందేహాలున్న నేపథ్యంలో ఈ సిరీస్ లో కొందరు పేసర్లనూ పరీక్షించేందుకు టీమిండియా యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శార్దూల్, ఉమ్రాన్ మాలిక్, జైదేవ్ ఉనద్కత్ లతో పాటు కొత్త బౌలర్ ముకేశ్ కుమార్ కూడా పోటీ పడుతున్నాడు. స్పిన్ విభాగంలో జడేజాకు తోడుగా తుదిజట్టులో అక్షర పటేల్, కుల్‌దీప్ లలో ఒక్కరికే చోటుదక్కనుంది. అయితే ఆల్ రౌండర్ విభాగంలో అక్షర పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భారత్ జట్టు ..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, సంజు శాంసన్/ ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/కుల్‌దీప్, శార్దూల్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్/ముకేశ్ కుమార్.
వెస్టిండీస్ జట్టు..
కింగ్, మేయర్స్, కార్టీ, హోప్ (కెప్టెన్), హెట్‌మయర్, రోమన్ పావెల్, రొమారియో షెఫర్డ్, సింక్లయిర్, అల్జారి జోసెఫ్, మోటీ/కరియన్, సీల్స్.