Rahul Dravid: వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలను వివరణ కోరిన బీసీసీఐ, అపజయానికి గల కారణాలపై బోర్డుకు ద్రవిడ్ సుదీర్ఘ వివరణ
రోహిత్ శర్మ కూడా ఇదే విషయం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. లీగ్ దశలో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ పైనే భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడడం గమనార్హం. పాకిస్తాన్‌తో మ్యాచులో భారత జట్టు ఈజీగానే విజయం సాధించింది.
New Delhi, December 02: స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో (World Cup 2023) భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. 10 మ్యాచుల్లో గెలిచిన టీమ్ఇండియా ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ (CWC Final) మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో కోట్లాది మంది భారత అభిమానులు నిరాశ చెందారు. వన్డే ప్రపంచకప్ ముగిసిన దాదాపు రెండు వారాలకు.. ఫైనల్ మ్యాచులో ఓటమిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ల నుంచి వివరణ కోరింది.
గురువారం ఢిల్లీలో బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah), వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఇతర అధికారులు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ద్రవిడ్ నేరుగా హాజరు కాగా.. లండన్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అయ్యారు. దక్షిణాఫ్రికా పర్యటనలకు భారత వన్డే, టీ20, టెస్టుల జట్లను ఎంపిక చేయడం ఈ సమావేశం ప్రధాన ఎజెండా అయినప్పటికీ, ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై వివరణ కోరినట్లు అయినట్లు ఆంగ్లమీడియాలో వార్తలు వచ్చాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌ను ద్రవిడ్ తప్పుపట్టాడు. పిచ్ నుంచి అటు బ్యాటర్లకు గానీ, ఇటు బౌలర్లకు గానీ ఏ మాత్రం సహకారం లభించలేదన్నాడు. రోహిత్ శర్మ కూడా ఇదే విషయం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. లీగ్ దశలో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ పైనే భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడడం గమనార్హం. పాకిస్తాన్‌తో మ్యాచులో భారత జట్టు ఈజీగానే విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అపసోపాలు పడి ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించగా భారత్ అవలీలగా ఛేదించింది. దాదాపు ఫైనల్ మ్యాచ్‌లో ఇలాగే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ట్రావిస్ హెడ్(137) శతకం చేయడంతో లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవికాలం పూర్తైంది. ద్రవిడ్ మార్గనిర్దేశంలో టీమ్ఇండియా వన్డేలు, టీ20లు, టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలిచింది. ద్వైపాకిక్ష సిరీస్‌లో అద్భుతంగా రాణించింది. ఐసీసీ టోర్నీల్లో ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నప్పటికీ టీ20 ప్రపంచకప్ 2022 సెమీ పైనల్, డబ్ల్యూటీసీ(2021-2023) ఫైనల్, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచుల్లో ఓడిపోయింది.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రదర్శనను చూసిన బీసీసీఐ మరోసారి ద్రవిడ్‌పై నమ్మకం ఉంచింది. అతడి కాంట్రాక్టును పొడిగించింది. అయితే.. ఎంత కాలం అతడి కాంట్రాక్టు పొడిగించింది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. యూఎస్-వెస్టిండీస్‌లు ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024 వరకు ద్రవిడ్ కాంట్రాక్ట్‌ను పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్‌లో ఈ మెగాటోర్నీ జరగనుంది.