Chris Gayle (Photo Credits: IANS)

ఐపీఎల్ అభిమానులకు షాక్. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల తుది జాబితాను (IPL 2022 Auction List) బీసీసీఐ నేడు (మంగళవారం) విడుదల చేసింది. మొత్తం 590 మంది ఆటగాళ్ల పేర్లున్న ఈ జాబితాలో క్రిస్ గేల్ పేరు (Chris Gayle Unavailable For IPL 2022 Auction) ఈసారి మాయమైంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన గేల్ ఈసారి వేలం నుంచి తప్పుకోవడం అతడి అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అలాగే, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్ పేరు కూడా జాబితాలో కనిపించలేదు.

బెంగళూరులో ఈ నెల 12, 13 తేదీల్లో వేలం జరగనుంది. బీసీసీఐ (BCCI)విడుదల చేసిన జాబితాలో 48 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల బ్రాకెట్‌లో ఉండగా, 20 మంది కనీస ధర రూ. 1.5 కోట్లుగా పేర్కొనగా, 34 మంది ఆటగాళ్లు కోటి రూపాయల బేస్ ప్రైస్ బ్రాకెట్‌లో ఉన్నారు. మొత్తం 590 మందిలో 228 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా, 355 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు, ఏడుగురు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ అతిపెద్ద స్టార్లలో ఒకడైన క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాలుపంచుకోకపోవడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

గేల్ పేరు ఐపీఎల్ వేలం జాబితాలో ( IPL 2022 Auction ) లేకపోవడంతో గతంలో అతడు ప్రాతినిధ్యం వహించిన రెండు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగినట్టు ‘క్రిక్‌బజ్’ ఓ కథనాన్ని ప్రచురించింది. అతడి పేరును కూడా లిస్ట్‌లో చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు పేర్కొంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు యూనివర్స్ బాస్ ఇప్పటికే ప్రకటించాడు.

ఐపీఎల్-15 వేలానికి 590 మంది ఆటగాళ్లు, ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు సన్నాహాలు

ఐపీఎల్‌లో గేల్ ఆరు సెంచరీలు సాధించాడు. ఫలితంగా మెగా టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 142 మ్యాచుల్లో 4,965 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది ఏడో అత్యధికం.

మరోవైపు బెన్ స్టోక్స్ కూడా వేలం కోసం ఈసారి తన పేరు నమోదు చేసుకోలేదు. ఈసారి అతడు కౌంటీ క్రికెట్ ఆడనున్నట్టు బ్రిటిష్ మీడియా పేర్కొంది. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టోక్స్ వేలికి గాయం కారణంగా సీజన్‌లో చాలా వరకు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వీరిద్దరితోపాటు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కూడా వేలానికి దూరమయ్యాడు. అతడి సహచరులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేలంలో పాల్గొంటున్నారు.

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా అర్చర్ కూడా పేరు కూడా జాబితాలో ఉన్నప్పటికీ, అతడు 2023 సీజన్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్ రాసీ వాండెర్ డుసెన్ వేలంలో పాల్గొంటుండగా, ఆ జట్టు కెప్టెన్ తెంబా బవుమా పేరు తుది జాబితాలో కనిపించలేదు.



సంబంధిత వార్తలు

IPL Eliminated Teams List: ఐపీఎల్ నుంచి మూడు జట్లు అవుట్, టాప్‌లోకి దూసుకువెళ్ళిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే జట్లు ఏవంటే..

IND vs ENG 4th Test: అన్ని విభాగాల్లో ర‌ఫ్ఫాడించిన టీమిండియా, ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ కైవ‌సం, నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం

IPL 2024 Schedule: 17 రోజులు 21 మ్యాచ్‌లు, తొలి మ్యాచ్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ రాయల్‌ చాలెంజర్స్‌ మధ్యనే, ఐపీఎల్ సగం షెడ్యూల్ ఇదిగో, పూర్తి షెడ్యూల్ లోక్‌సభ ఎన్నికల అప్‌డేట్ తర్వాతనే..

IPL 2024: ఆస్ట్రేలియా ప్లేయర్లా మజాకా, మిచెల్ స్టార్క్ ఒక్క బంతి వేస్తే రూ.7 లక్షలు, ఇక పాట్ కమ్మిన్స్ బంతి వేస్తే రూ.6.1 లక్షలు

IPL Auction 2024: సామ్ కర్రాన్ రూ.18.50 కోట్ల ఆల్-టైమ్ రికార్డు బద్దలు కొట్టేది ఇతడే, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌‌ను వేలంలో ఎవరూ కొనరని తెలిపిన టామ్ మూడీ

AUS vs AFG CWC 2023: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డేంజరస్ బ్యాటింగ్ దెబ్బకి వణికిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు, ఆఫ్ఘన్ ఆశలన్నీ బుగ్గిపాలు చేస్తూ సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

Ajay Jadeja Dancing Video: వీడియో ఇదిగో, డ్యాన్స్‌తో ఆస్ట్రేలియాను కవ్వించిన అజయ్‌ జడేజా, లబుషేన్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన అఫ్గనిస్తాన్‌ మెంటార్‌

ICC Cricket World Cup 2023: డిఫెండింగ్‌ చాంపియన్‌కు ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం, శ్రీలంక చేతిలో భారీ ఓటమి, వరుసగా నాలుగో పరాజయంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం