Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరు నేడే.. ఉత్కంఠ పోరుకు భారత్ 'సై'..
అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది.
Dubai, September 6: ఆసియా కప్ (Asia Cup) టీ20 టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ జోరు చూస్తే పాకిస్తాన్‌పై మళ్లీ గెలవడం (Winning) ఖాయమనిపించింది. అయితే ఆదివారం పాక్ చేతిలో ఎదురైన పరాజయం ‘సూపర్–4’ (Super-4) దశను ఆసక్తికరంగా మార్చింది. ఫైనల్ చేరాలంటే మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలవాల్సి ఉండగా, తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాపై ఒత్తిడి (Pressure) పెంచింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది.
అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది.