Dubai, September 5: ఆసియాకప్‌-2022లో (Asia Cup-2022) భారత్‌కు (India) తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌ సూపర్-4లో (Super-4) భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యంది. ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ పం‍త్‌ (Pant) , హార్ధిక్‌ పాండ్యా తీవ్రంగా నిరాశ పరిచారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌.. నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్న క్రమంలో పంత్‌ ఆ షాట్‌ (Shot) ఆడాల్సిన అవసరం లేదు.

సమయం వచ్చినపుడు నిరూపించుకుంటాం, మాకిది గుణపాఠం, ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని తెలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ

ఈ నేపథ్యంలో నిర్లక్షమైన షాట్‌ ఆడి పెవిలియన్‌కు చేరిన పంత్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకు అటువంటి షాట్‌ ఆడావు అంటూ పంత్‌పై హిట్‌మ్యాన్‌ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌కు పక్కన పెట్టి మరీ పంత్‌ను తీసుకున్నారు.