పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ పరాజయంపై (India and Pakistan)కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఒత్తిడి సహజమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. రిజ్వాన్, నవాజ్‌ల జోడీని విడదీయలేకపోయాం. వారిద్దరి అద్భుతమైన భాగస్వామ్యం మా విజయావకాశాలను దెబ్బకొట్టింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు.తాము మెరుగైన స్కోరు నమోదు చేసినా దానిని కాపాడుకోలేకపోయామంటూ విచారం వ్యక్తం చేశాడు.
పాకిస్తాన్ ఆటగాళ్లు తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఈ మ్యాచ్‌లో తాము చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నాడు. ‘‘వాళ్ల జట్టులో కూడా క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. సమయం వచ్చినపుడు తమను తాము నిరూపించుకున్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. నిజానికి సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలుసు. అయితే, 180 పరుగులు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మేము మెరుగైన స్కోరే నమోదు చేశాం. అయితే, దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యాం.
ఈ మ్యాచ్‌లో క్రెడిట్ పాకిస్తాన్‌కే (Played Better Than) దక్కుతుంది. మాకంటే వాళ్లు బాగా ఆడారని రోహిత్ అన్నాడు. ఇక జట్టుకు అవసరమైన సమయంలో రాణించాడంటూ హిట్‌మ్యాన్.. విరాట్ కోహ్లిని ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ వికెట్లు కోల్పోయిన సమయంలో తను బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు.