CSK vs GT IPL 2023 Qualifier 1: ప్లే ఆఫ్స్‌లో ధోని దిమ్మతిరిగే రికార్డు, గుజరాత్ టైటాన్స్ కొత్త వ్యూహం మహేంద్రుడి బాదుడును ఆపుతుందా..
ఇప్పటివరకు 21 ప్లే ఆఫ్స్ ఇన్నింగ్స్‌ల్లో 522 పరుగులు బాదాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమం.ఇప్పటివరకు అన్ని సీజన్‌ల ప్లే ఆఫ్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రైనా రికార్డు నెలకొల్పారు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో సీఎస్‌కే సారధి మహేంద్ర సింగ్ ధోనికి తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 21 ప్లే ఆఫ్స్ ఇన్నింగ్స్‌ల్లో 522 పరుగులు బాదాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమం.ఇప్పటివరకు అన్ని సీజన్‌ల ప్లే ఆఫ్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రైనా రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో మొత్తం 24 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 714 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 21 ఇన్నింగ్స్ ఆడి 522 పరుగులతో CSK కెప్టెన్ ఎంఎస్ ధోని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
రైనా, ధోని తర్వాత షేన్ వాట్సన్ (12 ఇన్నింగ్స్‌ల్లో 389 పరుగులు), మైక్ హస్సీ (11 ఇన్నింగ్స్‌ల్లో 388 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (14 ఇన్నింగ్స్‌ల్లో 373 పరుగులు) ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు. ఈ జాబితాలో టాప్-5 ఆటగాళ్లంతా సీఎస్‌కే సభ్యులే కావడం విశేషం.ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌లో భారీ స్కోర్‌లు సాధిస్తే ధోని టాప్ ప్లేస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ధోని అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా మారే అవకాశం ఉంది. ధోనిని కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలింగ్ విభాగం ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. మ్యాచ్ ధోని వరకు వచ్చిందో అతన్ని ఆపడం కష్టమేనని అభిమానులు భావిస్తున్నారు. ఛేదనలో అయినా.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పాత ధోనిని చూడటం ఖాయమని అతని అభిమానులు పందెలు కాస్తున్నారు.
ఈ రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ జరుగనుంది. రెండు క్వాలిఫైయర్, ఒక ఎలిమినేటర్, చివరగా ఫైనల్ మ్యాచ్‌తో సీజన్ ముగియనుంది.