CSK vs RCB Stat Highlights: కోహ్లీ దూకుడుతో నాలుగో విజయాన్ని నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌, వరుసగా మూడో మ్యాచులో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్

చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసిన కోహ్లి సేన అదరహో అనిపించింది. సీఎస్‌కే జట్టులో (Chennai Super Kings) అంబటి రాయుడు(42; 40 బంతుల్లో 4 ఫోర్లు), జగదీషన్‌(33;28 బంతుల్లో 4ఫోర్లు)లు మాత్రమే ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో ఏ మాత్రం కుదురుకోనివ్వలేదు.

Virat Kohli (Photo Credits: Twitter)

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ 37 పరుగుల తేడాతో విజయం (CSK vs RCB Stat Highlights) సాధించింది. చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసిన కోహ్లి సేన అదరహో అనిపించింది. సీఎస్‌కే జట్టులో (Chennai Super Kings) అంబటి రాయుడు(42; 40 బంతుల్లో 4 ఫోర్లు), జగదీషన్‌(33;28 బంతుల్లో 4ఫోర్లు)లు మాత్రమే ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో ఏ మాత్రం కుదురుకోనివ్వలేదు.

దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ అభిమానులను నిరాశపరచగా.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం మైదానంలో పరుగుల వరద పారించాడు. జట్టు భారం మొత్తాన్నీ తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించాడు. ఈ విజయంతో కోహ్లీ సేన (Royal Challengers Bangalore) టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానానికి ఎగబాకింది. కానీ చెన్నై మాత్రం వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానానికి దిగజారింది.

ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్‌లో డుప్లెసిస్‌(8), వాట్సన్‌(14)లు నిరాశపరిచారు. వీరిద్దర్నీ వాషింగ్టన్‌ సుందర్‌ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం రాయుడు-జగదీషన్‌ జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 65 పరుగులు జత చేసిన తర్వాత జగదీషన్‌ రనౌట్‌ అయ్యాడు. అనంతరం ధోని(10) నిరాశపరిచాడు. చహల్‌ బౌలింగ్‌ ధోని పెవిలియన్‌ చేరాడు. ధోని ఔలైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సామ్‌ కరాన్‌ డకౌట్‌ కావడంతో బ్యాటింగ్‌ భారం రాయుడిపై పడింది. రాయుడు ఆడినా మరొక ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు.

ఢిల్లీ హ్యట్రిక్ విజయం, రాజస్థాన్‌కు నాలుగో పరాభవం, 46 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్‌పై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌

ఉదాన వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి రాయుడు క్లీన్‌బౌల్డ్ కావడంతో సీఎస్‌కే లక్ష్య ఛేదనలో చతికిలబడింది. సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో మోరిస్‌ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌కు రెండు వికెట్లు లభించాయి. ఉదాన,చహల్‌కు చెరో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా తేలిపోయిన సీఎస్‌కే.. ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దేవదూత్‌ పడిక్కల్‌(33; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి( 90 నాటౌట్‌; 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శివం దూబే( 22 నాటౌట్‌; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే అరోన్‌ ఫించ్‌(2) వికెట్‌ను కోల్పోయింది.

ఆ తరుణంలో దేవదూత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లిలు జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి 53 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్‌ ఔటయ్యాడు. అటు తర్వాత ఏబీ డివిలియర్స్‌ డకౌట్‌ కాగా, వాషింగ్టన్‌(10) కూడా నిరాశపరిచాడు. శార్దూల్‌ ఠాకూర్‌ తన పదునైన బంతులతో పడిక్కల్‌, డివిలియర్స్‌లను ఒకే ఓ‍వర్‌లో ఔట్‌ చేసి మంచి బ్రేక్‌ ఇచ్చాడు.

వాషింగ్టన్‌ సుందర్‌.. సామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. కాగా, కోహ్లి కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు శివం దూబేలు బ్యాట్‌ ఝుళిపించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించగా, సామ్‌ కరాన్‌, దీపక్‌ చాహర్‌లకు తలో వికెట్‌ లభించింది. కోహ్లీ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి 52 బంతుల్లో 90 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఒకానొక దశలో 140 పరుగులు కూడా దాటదనుకున్న బెంగళూరు.. కోహ్లీ వీరబాదుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు రెండు వికెట్లు, శామ్ కర్రన్, దీపక్ చాహర్‌లకు చెరో వికెట్ దక్కింది.

స్కోరు వివరాలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: పడిక్కల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) శార్దుల్‌ 33; ఫించ్‌ (బి) చహర్‌ 2; కోహ్లి (నాటౌట్‌) 90; డివిలియర్స్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 0; సుందర్‌ (సి) ధోని (బి) స్యామ్‌ కరన్‌ 10; దూబే (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 169.

వికెట్ల పతనం: 1–13, 2–66, 3–67, 4–93.

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–10–1, స్యామ్‌ కరన్‌ 4–0–48–1, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–40–2, బ్రేవో 3–0–29–0, కరణ్‌ శర్మ 4–0–34–0, జడేజా 2–0–7–0.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (బి) సుందర్‌ 14; డుప్లెసిస్‌ (సి) మోరిస్‌ (బి) సుందర్‌ 8; రాయుడు (బి) ఉదాన 42; జగదీశన్‌ (రనౌట్‌) 33; ధోని (సి) గురుకీరత్‌ (బి) చహల్‌ 10; స్యామ్‌ కరన్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 0; జడేజా (సి) గురుకీరత్‌ (బి) మోరిస్‌ 7; బ్రేవో (సి) పడిక్కల్‌ (బి) మోరిస్‌ 7; దీపక్‌ చహర్‌ (నాటౌట్‌) 5; శార్దుల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132.

వికెట్ల పతనం: 1–19, 2–25, 3–89, 4–106, 5–107, 6–113, 7–122, 8–126.

బౌలింగ్‌: మోరిస్‌ 4–0–19–3, సైనీ 4–0–18–0, ఉదాన 4–0–30–1, సుందర్‌ 3–0–16–2, చహల్‌ 4–0–35–1, దూబే 1–0–14–0.