Marcus Stoinis (Photo Credits: Twitter)

Sharjah, October 10: ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని (RR vs DC, IPL 2020 Match Result) నమోదు చేసుకుంది. షార్జా పిచ్‌పై లక్ష్యఛేదనలో వెనుకబడిన రాజస్థాన్‌ రాయల్స్‌ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం ఇక్కడ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ( RR vs DC Dream11 IPL 2020) ఢిల్లీ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది.

హెట్‌మైర్‌ (Shimron Hetmyer) (24 బంతుల్లో 45; ఒక ఫోర్‌, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. స్టోయినిస్‌ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్మిత్‌ సేన 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. తెవాటియా (38) టాప్‌ స్కోరర్‌. ఢిల్లీ బౌలర్లలో రబాడ 3, స్టోయినిస్‌, అశ్విన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అశ్విన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

బ్యాటింగ్‌లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై, 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం, కోల్‌కతాను గెలిపించిన రాహుల్‌ త్రిపాఠి మెరుపులు

చిన్న మైదానంలో ఓ మాదిరి లక్ష్యమే అయినా రాజస్థాన్‌ పరుగులు తీసేందుకు అష్టకష్టాలు పడింది. ఎక్కువగా పేస్‌ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో 2 ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించిన రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌ (13) కాసేపటికే వెనుదిరగగా.. యువ ఓపెనర్‌ జైస్వాల్‌ (34)తో కలిసి స్మిత్‌ (24) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించాక స్మిత్‌ ఔటయ్యాడు. కాసేపటికే శాంసన్‌ (5), లోమ్రర్‌ (1) ఔట్‌ కావడంతో.. రాజస్థాన్‌ మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. జైస్వాల్‌ను స్టొయినిస్‌ పెవిలియన్‌ పంపగా..తెవాటియా పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్‌లోనే ధావన్‌ (5) ఔట్‌ కాగా.. పృథ్వీ షా (19), శ్రేయస్‌ అయ్యర్‌ (22) ఎక్కువసేపు నిలువలేకపోయారు. రిషబ్‌ పంత్‌ (5) ఆకట్టుకోలేకపోయాడు. ఈ దశలో స్టోయినిస్‌తో కలిసి హెట్‌మైర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా ఈ జోడీ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. చివర్లో హర్షల్‌ పటేల్‌ (16), అక్షర్‌ పటేల్‌ (17) విలువైన పరుగులు జోడించారు.

స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా (సి అండ్‌ బి) ఆర్చర్‌ 19; శిఖర్‌ ధవన్‌ (సి) జైస్వాల్‌ (బి) ఆర్చర్‌ 5; శ్రేయాస్‌ (రనౌట్‌/జైస్వాల్‌) 22; పంత్‌ (రనౌట్‌/వోహ్రా/తెవాటియా) 5; స్టొయినిస్‌ (సి) స్మిత్‌ (బి) తెవాటియా 39; హెట్‌మయెర్‌ (సి) తెవాటియా (బి) త్యాగి 45; హర్షల్‌ (సి) తెవాటియా (బి) ఆర్చర్‌ 16; అక్షర్‌ (సి) బట్లర్‌ (బి) ఆండ్రూ టై 17; రబాడ (నాటౌట్‌) 2; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 184/8; వికెట్ల పతనం: 1-12, 2-42, 3-50, 4-79, 5-109, 6-149, 7-181, 8-183; బౌలింగ్‌: వరుణ్‌ ఆరోన్‌ 2-0-25-0; ఆర్చర్‌ 4-0-24-3; కార్తీక్‌ త్యాగి 4-0-35-1; ఆండ్రూ టై 4-0-50-1; శ్రేయాస్‌ గోపాల్‌ 2-0-23-0; తెవాటియా 4-0-20-1.

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్‌ (బి) స్టొయినిస్‌ 34; బట్లర్‌ (సి) ధవన్‌ (బి) అశ్విన్‌ 13; స్మిత్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) నోకియా 24; శాంసన్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) స్టొయినిస్‌ 5; మహిపాల్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 1; రాహుల్‌ తెవాటియా (బి) రబాడ 38; ఆండ్రూ టై (సి) రబాడ (బి) అక్షర్‌ 6; ఆర్చర్‌ (సి) శ్రేయాస్‌ అయ్యర్‌ (బి) రబాడ 2; శ్రేయాస్‌ గోపాల్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) హర్షల్‌ 2; కార్తీక్‌ త్యాగి (నాటౌట్‌) 2; వరుణ్‌ (సి) పంత్‌ (బి) రబాడ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.4 ఓవర్లలో 138 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-15, 2-56, 3-72, 4-76, 5-82, 6-90, 7-100, 8-121, 9-136; బౌలింగ్‌: రబాడ 3.4-0-35-3; నోకియా 4-0-25-1; అశ్విన్‌ 4-0-22-2; హర్షల్‌ పటేల్‌ 4-0-29-1; అక్షర్‌ పటేల్‌ 2-0-8-1; స్టొయినిస్‌ 2-0-17-2.