DC vs MI IPL 2021: మిశ్రా స్పిన్‌ మాయాజాలానికి తడబడిన ముంబై, 6 వికెట్ల తేడాతో రోహిత్ సేనను చిత్తు చేసిన పంత్ సేన, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అమిత్‌ మిశ్రా

ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఢిల్లీ ఒత్తిడిని జయించి రోహిత్‌సేనను ఓడించింది.

Delhi Capitals (Photo Credits: Twitter/@IPL)

గతేడాది తమకు టైటిల్‌ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఢిల్లీ ఒత్తిడిని జయించి రోహిత్‌సేనను ఓడించింది. ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన అమిత్‌ మిశ్రా స్పిన్‌ మాయాజాలంతో ముంబైని కుప్పకూల్చాడు. శిఖర్‌ ధవన్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), స్మిత్‌ (29 బంతుల్లో 4 ఫోర్లతో 33) కీలక ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్‌ (30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), సూర్యకుమార్‌ (15 బంతుల్లో 4 ఫోర్లతో 24) వేగంగా ఆడారు. అవేశ్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. చివర్లో లలిత్‌ యాదవ్‌ (25 బంతుల్లో 1 ఫోర్‌తో 22 నాటౌట్‌), హెట్‌మయెర్‌ (9 బంతుల్లో 2 ఫోర్లతో 14 నాటౌట్‌) సంయమనంతో ఆడారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అమిత్‌ మిశ్రా నిలిచాడు.

ధోనీ కెప్టెన్సీ మాయాజాలం, రెండో విజయాన్ని నమోదు చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, మొయిన్‌ అలీ దెబ్బకు విలవిలలాడిన రాజస్తాన్‌ రాయల్స్‌, 45 పరుగుల ఆధిక్యంతో ధోనీ సేన గెలుపు

స్కోరుబోర్డు: ముంబై: రోహిత్‌ (సి) స్మిత్‌ (బి) మిశ్రా 44; డికాక్‌ (సి) పంత్‌ (బి) స్టొయినిస్‌ 2; సూర్యకుమార్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ 24; ఇషాన్‌ (బి) మిశ్రా 26; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) మిశ్రా 0; క్రునాల్‌ (బి) లలిత్‌ 1; పొలార్డ్‌ (ఎల్బీ) మిశ్రా 2; జయంత్‌ (సి అండ్‌ బి) రబాడ 23; రాహుల్‌ చాహర్‌ (సి)పంత్‌ (బి) అవేశ్‌ 6; బుమ్రా (నాటౌట్‌) 3; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 137/9. వికెట్ల పతనం: 1-9, 2-67, 3-76, 4-77, 5-81, 6-84, 7-123, 8-129, 9-135. బౌలింగ్‌: స్టొయినిస్‌ 3-0-20-1; అశ్విన్‌ 4-0-31-0; రబాడ 3-0-25-1; అమిత్‌ మిశ్రా 4-0-24-4; అవేశ్‌ 2-0-15-2; లలిత్‌ యాదవ్‌ 4-0-17-1.

ఢిల్లీ: పృథ్వీషా (సి అండ్‌ బి) జయంత్‌ 7, ధవన్‌ (సి) క్రునాల్‌ (బి) చాహర్‌ 45, స్టీవెన్‌ స్మిత్‌ (ఎల్బీ) పొలార్డ్‌ 33, లలిత్‌ (నాటౌట్‌) 22, పంత్‌ (సి) క్రునాల్‌ (బి) బుమ్రా 7, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.1 ఓవర్లలో 138/4. వికెట్లపతనం: 1-11, 2-64 3-100, 4-115. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-23-0, జయంత్‌ 4-0-25-1, బుమ్రా 4-0-32-1, క్రునాల్‌ పాండ్యా 2-0-17-0, రాహుల్‌ చాహర్‌ 4-0-29-1, పొలార్డ్‌ 1.1-0-9-1.