IPL 2022 Mega Auction: వేలంలో డేవిడ్ వార్నర్‌కి ఘోర అవమానం, భారీ ధరకు పోతాడని భావిస్తే.. రూ. 6.25 కోట్లకు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు
6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు(Delhi Capitals Squad for IPL 2022) అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. అయితే వార్నర్ ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోతాడని ఎవరు ఊహించలేదు
భారీ ధరకు అమ్ముడుపోతాడని భావించిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు(Delhi Capitals Squad for IPL 2022) అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. అయితే వార్నర్ ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోతాడని ఎవరు ఊహించలేదు. 2016 ఎస్‌ఆర్‌హెచ్‌ను చాంపియన్స్‌గా నిలిపిన వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ అవమానకరరీతిలో రిలీజ్ చేసింది. ఆ తర్వాత వార్నర్ తనదైన ఆటతీరుతో మెప్పించాడు.
ముంబై ఇండియన్స్ వార్నర్‌ను దక్కించుకోవాలనుకున్నా చివరి నిమిషంలో విత్‌డ్రా చేసుకుంది. దీంతో వార్నర్ తక్కువ ధరకే (DC for Rs 6.25 Crore at Mega Auction) ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమ్ముడుపోయాడు. ఈసారి వేలంలో (IPL 2022 Mega Auction) మంచి ధర దక్కుతుంది అని భావించిన ఫ్యాన్స్‌కు ఇది నిరాశే అని చెప్పొచ్చు. ఇంత తక్కువ ధరకు వార్నర్ అమ్ముడవడం వెనుక అతనికి మళ్లీ అవమానం జరిగిందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.
గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున వార్నర్‌కు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఆఖర్లో అవకాశాలు ఇవ్వకపోవడం జరిగింది. అంతేకాదు జట్టులో చోటు కోల్పోయిన వార్నర్ ఆఖరికి డ్రింక్స్‌బాయ్‌గా సేవలందించాడు. ఇవన్నీ చూసి వార్నర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అవమానభారంతో ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడిన వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.