IPL 2023: ఈ ఆటకు రూ. 13 కోట్లు ఎందుకు బ్రో, హ్యరీ బ్రూక్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు, మూడవసారి కూడా విఫలమైన బ్రూక్

మరోసారి బ్రూక్‌ దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన బ్రూక్‌.. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచాడు.

Harry Brook (Photo-Twitter/ESPN)

హైదరాబాద్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 17.1 ఓవర్లలో రెండు వికెట్టు కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిఫాఠి(74 నాటౌట్‌) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ మార్‌క్రమ్‌(37నాటౌట్‌) రాణించాడు.

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 66 బంతుల్లో 99 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఉమ్రాన్‌ రెండు, జానెసన్‌, భువీ ఒక వికెట్‌ సాధించాడు.

రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ వికెట్ వీడియో ఇదిగో, అత్యధిక సార్లు హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు

ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఆటగాడు హ్యరీ బ్రూక్‌ ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. మరోసారి బ్రూక్‌ దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన బ్రూక్‌.. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన బ్రూక్‌ 14 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసింది. ఇక ఇంత భారీ మొత్తం తీసుకుని మరి దారుణంగా విఫలమవుతున్న బ్రూక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.