Virat Kohli-BCCI Rift: విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన కపిల్ దేవ్, జట్టు కెప్టెన్సీని నిర్ణయించే హక్కు సెలెక్టర్లకు ఉంటుంది, వారు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపిన మాజీ కెప్టెన్
బీసీసీఐపై చేసిన వాఖ్యలు ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ (BCCI) తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. అంతేకాదు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా తనకు ఎవరూ సూచించలేదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. బీసీసీఐపై చేసిన వాఖ్యలు ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ (BCCI) తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. అంతేకాదు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా తనకు ఎవరూ సూచించలేదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోహ్లి (Virat Kohli) చేసిన వాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చిది. ఛీప్ సెలెక్టర్ చేతన్ శర్మ.. కోహ్లితో కెప్టెన్సీ గురించి ముందుగానే చర్చించాడని బీసీసీఐ పేర్కొంది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
తాజాగా ఈ వివాదంపై (Virat Kohli-BCCI Rift) లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. జట్టు కెప్టెన్సీని నిర్ణయించే హక్కు సెలెక్టర్లకు ఉంటుంది అని అతడు అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఆడినంతగా క్రికెట్ సెలెక్టర్లు ఆడి ఉండకపోవచ్చని... కానీ కెప్టెన్సీని నిర్ణయించే సంపూర్ణ అధికారం సెలెక్టర్లకు ఉంటుందని కపిల్ (Former India captain Kapil Dev) అన్నారు. కెప్టెన్సీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలను సెలెక్టర్లు కోహ్లీకే కాదు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ విషయం కోహ్లీకే కాకుండా అందరు ఆటగాళ్లకు వర్తిస్తుందని చెప్పారు. కెప్టెన్సీ వివాదానికి కోహ్లీ ముగింపు పలకాలని... దక్షిణాఫ్రికా టూర్ పై దృష్టి సారించాలని హితవు పలికారు. సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.