AB De Villiers on Virat Kohli Second Child: విరాట్ కోహ్లీ 2వ సారి తండ్రి కాబోతున్నారనే వార్త నిజం కాదు, తప్పుడు సమాచారం పంచుకున్నానని తెలిపిన ఎబి డెవిలియర్స్

విరాట్ కోహ్లి, అనుష్క శర్మలపై చేసిన వ్యాఖ్యలపై ఏబీ డివిల్లర్స్ యూటర్న్ తీసుకున్నాడు.తాజాగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు నిజం కాదని ఏబీ డివిల్లర్స్ చెప్పారు.

Virushka Expecting Their Second Child (PIC @ X)

విరాట్ కోహ్లి, అనుష్క శర్మలపై చేసిన వ్యాఖ్యలపై ఏబీ డివిల్లర్స్ యూటర్న్ తీసుకున్నాడు.తాజాగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు నిజం కాదని ఏబీ డివిల్లర్స్ చెప్పారు.నేను నా యూట్యూబ్ ఛానల్ లో ఒక భయంకరమైన తప్పు చేసాను,వారి గురించి తప్పుడు సమాచారాన్ని పంచుకున్నాను, అది నిజం కాదని తెలిపారు.

రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ, లైవ్ లో టంగ్ స్లిప్ అయిన డివిలియ‌ర్స్, అనుష్క శ‌ర్మ‌తో టైం గ‌డుపుతున్న కోహ్లీ

విరాట్ కుటుంబానికి ఏది మంచిదో అది మొదటి స్థానంలో ఉంటుందని నేను భావిస్తున్నాను. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, నేను చేయగలిగేది అతనికి శుభాకాంక్షలు మాత్రమే. అతని విరామానికి కారణం ఏమైనప్పటికీ, అతను దీని నుండి మరింత బలంగా, మెరుగ్గా మరియు తాజాగా తిరిగి వస్తాడని నేను ఆశిస్తున్నానని తెలిపారు. భారత్ ఇంగ్లండ్ సిరీస్ సమయంలో విరాట్ కోహ్లీ దూరమయిన సంగతి విదితమే. అత్యవసరంగా ఇంటికి బయలు దేరాడు. ఈ నేపథ్యంలోనే ఏబీ డివిలియర్స్ రెండవ బిడ్డను స్వాగతించబోతున్నారని తెలిపాడు.