ICC 2023 ODI World Cup: భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చూడాలంటే టికెట్ ఖరీదు రూ.57 లక్షలు, పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారంటూ బీసీసీఐపై మండిపడుతున్న క్రికెట్ అభిమానులు
వరల్డ్‌కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మధ్య అక్టోబర్ 14వ తేదిన మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.
వరల్డ్‌కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మధ్య అక్టోబర్ 14వ తేదిన మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఇందుకోసం లక్షల రూపాయలు పెట్టేందుకు వెనుకాడటం లేదు. సౌత్ ప్రీమియం వెస్ట్ బే టికెట్ సంస్థకు చెందిన వయాగోగో ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మగా.. ఆ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని టికెట్లకు 19.5 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఇక స్టేడియంలోని అప్పర్ టైర్‌లో ఉన్న కొన్ని టికెట్లు ఇంకా అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అప్పర్ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా స్పోర్ట్స్ టికెట్ల ఎక్ఛ్సేంజ్, రీసేల్ వెబ్‌సైట్ ‘వయాగోగో’లో చూపిస్తోంది. అయితే, ఒక్కో టికెట్ రూ.57 లక్షలు ఉండటం గమనార్హం. దీంతో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో బీసీసీఐ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. వయాగోగో వెబ్‌సైట్‌లో కొన్ని టికెట్లు 65 వేల నుంచి 4.5 లక్షల వరకు అమ్ముడవుతున్నాయని ఓ యూజర్ పేర్కొన్నారు. పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఓ టికెట్‌ను 15 లక్షలకు అమ్ముతున్నట్లు వయోగోగో యాప్‌లో చూశానని మరో యూజర్ పేర్కొన్నాడు. సెకండరీ మార్కెట్ ద్వారా అమ్మే టికెట్లు అధిక ధరను వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు 41 వేల నుంచి 3 లక్షల వరకు అమ్మారు. ఇక ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్‌కు టికెట్ ధర 2.3 లక్షలుగా ఉంది.