Under-19 World Cup: శ్రీలంకకు మరో షాక్‌ ఇచ్చిన ఐసీసీ, వచ్చే ఏడాది జరుగనున్న అతిపెద్ద టోర్నీ వేదిక మార్పు, శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలింపు

అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు.

Sri Lanka Sack Entire Cricket Board Over World Cup Humiliation Against India

Colombo, NOV 22: శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు (Sri Lanka Cricket Board) మరో షాక్‌ తగిలింది. ఆ దేశ క్రికెట్‌ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ (ICC) మరో ఝలక్‌ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్‌ను ఐసీసీ (ICC) మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్‌–19 వరల్డ్‌కప్‌ను (Under-19 World Cup) విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు.

ICC Bans Transgender Cricketers: అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం, గేమ్ సమగ్రతను కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి 

కాగా, భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్‌ దశలోనే ఇంటిబాట పటి​న శ్రీలంక క్రికెట్‌ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై సస్పెన్షన్‌ వేటు వేసింది.