T20 World Cup 2022: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ఆడే భారత జట్టు ఇదే, చివరి అంకానికి చేరుకున్న టీ20 ప్రపంచకప్ 2022, పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి
తాజాగా గ్రూప్-1, గ్రూప్ 2లో సెమీస్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూపు 2లో మొదటి మ్యాచ్‌లో పటిష్ట జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాను ‘పసికూన’ నెదర్లాండ్స్ మట్టికరిపించడంతో టీమిండియా నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
ఐసీసీ ప్రపంచకప్ 2022లో (T20 World Cup 2022) తుది సమరానికి టీములు రెడీ అయ్యాయి. తాజాగా గ్రూప్-1, గ్రూప్ 2లో సెమీస్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూపు 2లో మొదటి మ్యాచ్‌లో పటిష్ట జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాను ‘పసికూన’ నెదర్లాండ్స్ మట్టికరిపించడంతో టీమిండియా నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తర్వాతి మ్యాచ్‌లో సెమీస్ అర్హత కోసం పాకిస్తాన్- బంగ్లాదేశ్ పోటీపడగా దాయాది దేశం విక్టరీ సాధించి భారత్‌తో పాటు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.ఇక జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్‌ను తేలికగా తీసుకోని రోహిత్ సేన ఘన విజయంతో సూపర్-12ను ముగించింది.
జింబాబ్వే పై టీమిండియా ఘన విజయం, సెమీస్ లోకి దూసుకెళ్లిన రోహిత్ సేన
ఇక గ్రూప్-1 విషయానికొస్తే.. న్యూజిలాండ్.. ఐర్లాండ్‌ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా.. ఇంగ్లండ్- శ్రీలంక మ్యాచ్ ఫలితంపై ఆధారపడ్డ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది. శ్రీలంకను బట్లర్ బృందం చిత్తు చేయడంతో ఆతిథ్య ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లంకపై విజయంతో ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో సెమీఫైనల్లో ఎవరితో ఎవరు తలపడనున్నారో ఖరారైంది.
మొదటి సెమీ ఫైనల్
నవంబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్
వేదిక: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ
సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి
న్యూజిలాండ్
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్.
పాకిస్తాన్:
మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, హైదర్ అలీ
రెండో సెమీ ఫైనల్
నవంబర్ 10: భారత్ వర్సెస్ ఇంగ్లండ్
వేదిక: అడిలైడ్ ఓవల్, అడిలైడ్
సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి
జట్లు
భారత్:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, దీపక్ హుడా.
ఇంగ్లండ్:
అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, టైమల్ మిల్స్, ఫిలిప్ సాల్ట్
ఫైనల్: నవంబరు 13, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్