IND vs ENG 4th Test 2021: స్పిన్ మ్యాజిక్ దెబ్బ, ఇంగ్లండ్ పని మూడు రోజుల్లోనే ఫినిష్, నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్‌ఇండియా
ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తరహాలోనే ఇంగ్లండ్ సొంతగడ్డపై ఇంగ్లీష్ టీంను కూడా ఇండియా చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్‌లో భారత్... ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది.
స్పిన్ మ్యాజిక్‌కు దెబ్బకు మూడో రోజు ముగియకుండానే ఇంగ్లండ్ రెండోసారి చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తరహాలోనే ఇంగ్లండ్ సొంతగడ్డపై ఇంగ్లీష్ టీంను కూడా ఇండియా చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్‌లో భారత్... ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది.
కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు.
అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’.... పంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు లభించాయి. చెన్నైలో తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్ చివరకు 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. జూన్ 18 నుంచి 22 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్‌లోనే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది.
ఓవర్‌నైట్ స్కోరు 294/7 స్కోరుతో ఆట కొనసాగిస్తూ మూడో రోజు మరో 20.4 ఓవర్లు ఆడగలిగిన భారత్ 71 పరుగులు జత చేసి చివరి 3 వికెట్లు చేజార్చుకుంది. ముఖ్యంగా సుందర్, అక్షర్ శతక భాగస్వామ్యం హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు అలవోకగా పరుగులు సాధించారు. బెస్ ఓవర్లో వరుస బంతుల్లో సుందర్ సిక్స్, ఫోర్ బాదగా, లీచ్ ఓవర్లో అక్షర్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే ఎట్టకేలకు రనౌట్‌తో ఈ జోడీని ఇంగ్లండ్ విడగొట్టింది.
రూట్ బౌలింగ్‌లో సుందర్ షాట్ మిడాన్ దిశగా ఆడగా... సింగిల్ కోసం ప్రయత్నించిన అక్షర్ సాధ్యంకాక వెనక్కి వచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ సమయంలో సరిగ్గా 96 పరుగుల వద్ద ఉన్న సుందర్ దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. స్టోక్స్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతికే ఇషాంత్ శర్మ (0) అవుట్ కాగా, నాలుగో బంతికి సిరాజ్ (0) బౌల్డ్ కావడంతో సుందర్ నిరాశగా నిలబడిపోయాడు.
ఎప్పటిలాగే ఇంగ్లండ్ జట్టు భారత స్పిన్ ద్వయాన్ని సరిగ్గా ఎదుర్కోలేక చేతులెత్తేసింది. నాలుగు ఓవర్ల వరకు ఎలాగోలా నిలబడిన జట్టు పతనం ఐదో ఓవర్‌తోనే మొదలైంది. అశ్విన్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో క్రాలీ (5), బెయిర్‌స్టో (0)లను పెవిలియన్ పంపించాడు. కొద్ది సేపటికే సిబ్లీ (3)ని అవుట్ చేసి అక్షర్ తన వికెట్ల ఖాతా తెరవగా, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన స్టోక్స్ (2) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. పోప్ (15), రూట్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా... అదీ ఎక్కువసేపు సాగలేదు. పంత్ అద్భుత స్టంపింగ్‌కు పోప్ వెనుదిరగ్గా, మరో రెండు బంతులకే అశ్విన్ బౌలింగ్‌లో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
65/6 స్కోరుతో దాదాపు ఓటమి ఖాయమైన దశలో ఒక్క లారెన్స్ మాత్రం కొంత పోరాడే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ‘సున్నా’ వద్ద ఉన్న లారెన్స్ పట్టుదలగా ఆడి అర్ధ సెంచరీ సాధించగలిగాడు. మరో ఎండ్‌లో ఫోక్స్ (13), బెస్ (2)లను అక్షర్ అవుట్ చేసి ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కొద్ది సేపటికే లీచ్ (2)ను అవుట్ చేసిన అశ్విన్, అదే ఓవర్లో లారెన్స్‌ను బౌల్డ్ చేయడంతో టెస్టు సిరీస్ ముగిసింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 205;
భారత్ తొలి ఇన్నింగ్స్: 365;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రహానే (బి) అశ్విన్ 5; సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 3; బెయిర్‌స్టో (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీ) (బి) అశ్విన్ 30; స్టోక్స్ (సి) కోహ్లి (బి) అక్షర్ 2; పోప్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 15; లారెన్స్ (బి) అశ్విన్ 50; ఫోక్స్ (సి) రహానే (బి) అశ్విన్ 13; బెస్ (సి) పంత్ (బి) అక్షర్ 2; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 2; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (54.5 ఓవర్లలో ఆలౌట్) 135.
వికెట్ల పతనం: 1–10, 2–10, 3–20, 4–30, 5–65, 6–65, 7–109, 8–111, 9–134, 10–135.
బౌలింగ్: సిరాజ్ 4–0–12–0, అక్షర్ 24–6–48–5, అశ్విన్ 22.5–4–47–5, సుందర్ 4–0–16–0.