శ్రీలంక మాజీ ప్లేయర్ సూరజ్ రణ్‌దీవ్ (Former Sri Lanka cricketer Suraj Randiv) గుర్తున్నాడా... ఈ ఆఫ్ స్పిన్నర్ మనకు గుర్తు ఉండకపోవచ్చు కాని డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వగ్ కు అయితే తప్పక గుర్తుంటాడు. సెహ్వాగ్ (Virender Sehwag) సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ‘నోబాల్’ వేసిన బౌలర్‌గానే భారత అభిమానులందరికీ గుర్తు ఉండిపోతాడు.
ఆ నోబాల్ తో సెహ్వాగ్ 99 దగ్గర నాటౌట్ గా మిగిలిపోయాడు. ఆ మ్యాచ్ లో.. శ్రీలంక తరఫున ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టి20 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్‌స్పిన్నర్ ఇప్పుడు పొట్టకూటి కోసం ఆస్ట్రేలియాలో డ్రైవర్ అవతారం ఎత్తాడు.
రెండేళ్ల క్రితం స్వదేశంలో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అతను ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. మెల్‌బోర్న్‌లో స్థానిక క్లబ్‌లలో క్రికెట్ ఆడుతున్నా... సంపాదన కోసం అతను మరో ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు. అక్కడే రణ్‌దీవ్ అక్కడ బస్సు డ్రైవర్‌గా (Now Working As Bus Drivers in Melbourne) పని చేస్తున్నాడు. ఫ్రాన్స్ కంపెనీ ‘ట్రాన్స్‌డెవ్’ నిర్వహణలో నడుస్తున్న ప్రజా రవాణా బస్సులో అతను డ్రైవర్‌గా ఉన్నాడు.
Here's Virender Sehwag Tweet
6yrs ago on this day,Hewa Kaluhalamullage Suraj Randiv Kaluhalamulla did this,was hit fr a 6,but I remained 99notout pic.twitter.com/iwhOFdtQNL
— Virender Sehwag (@virendersehwag) August 16, 2016
కొన్ని చిన్నస్థాయి క్రికెట్ దేశాల్లో ఆదాయం కోసం ఇతర పనులు చేయడం సాధారణమే అయినా... ఒక ఆసియా జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ చిరుద్యోగం చేయడం మాత్రం పెద్దగా కనిపించదు. 2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రణ్‌దీవ్ 8 మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకునే ప్రదర్శనే (7.68 ఎకానమీ) కనబర్చాడు. లంక తరఫున రణ్‌దీవ్ 2016లో చివరి మ్యాచ్ ఆడాడు.
అతనితోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు చింతక జయసింఘే (శ్రీలంక–5 టి20లు), వాడింగ్టన్ వయెంగా (జింబాబ్వే–1 టెస్టు, 3 వన్డేలు) కూడా ఇదే కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. సెహ్వాగ్ సైత ఆరేళ్ల క్రితం నా సెంచరీ మిస్ చేశాడంటూ ట్వీట్ కూడా చేశారు.