IND vs NZ: టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్, ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

తద్వారా మూడు టెస్టుల సిరీస్‌లో భార‌త్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ముంబై వేదిక‌గా జరిగిన ఆఖ‌రి టెస్టులో కివీస్ స్పిన్న‌ర్లు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు.

Pune Test New Zealand won by 113 runs(Cricbuzz X)

టీమిండియాతో జ‌రిగిన మూడో టెస్టులో 25 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ అద్బుత విజ‌యం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌లో భార‌త్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ముంబై వేదిక‌గా జరిగిన ఆఖ‌రి టెస్టులో కివీస్ స్పిన్న‌ర్లు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 147 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ స్పిన్న‌ర్లు త‌మ మయాజాలంతో డిఫెండ్ చేసుకున్నారు. అజాజ్ ప‌టేల్‌, గ్లెన్ ఫిలిప్స్ దాటికి భార‌త్ కేవ‌లం 121 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అజాజ్ ప‌టేల్ 6 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ఫిలిప్స్ 3 వికెట్ల‌తో టీమిండియాను దెబ్బ‌తీశారు.

భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్(64) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇక ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా అజాజ్ ప‌టేల్ నిల‌వ‌గా, ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును విల్ యంగ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఓ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది.

రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు, అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ల రూపంలో సాధించిన రెండవ బౌలర్‌గా ఘనత

భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను  వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వ‌ర‌కు  స్వ‌దేశంలో టీమిండియా ఏ జట్టు చేతిలో కూడా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవ్వలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ భార‌త జ‌ట్టును వైట్ వాష్ చేసి చరిత్రకెక్కింది. ఇంతకుముందు 2000లో దక్షిణాఫ్రికా చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భారత్‌ వైట్‌ వాష్‌కు గురైంది. కాగా టీమిండియా టెస్టుల్లో 200లోపు టార్గెట్‌ను ఛేజ్ చేయలేకపోవడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం.