IND vs SA 1st ODI 2022: తొలి వన్డేలో భారత్ ఓటమి, 31 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా, మూడు వన్డేల సిరీస్‌లో1-0 ఆధిక్యంలో నిలిచిన సఫారీలు

31 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో(IND vs SA 1st ODI 2022) సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది.

Temba Bavuma (Photo Credits: Twitter)

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. 31 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో(IND vs SA 1st ODI 2022) సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. రాహుల్ 12, శిఖర్ ధావన్ 79, కోహ్లీ 51, శార్దూల్ ఠాగూర్ 50 (నాటౌట్), రిషబ్ పంత్ 16, శ్రేయస్ అయ్యర్ 17, వెంకటేశ్వర్ అయ్యర్ 2, రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులకు అవుటయ్యారు.

అంతకుముందు సఫారీలు 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డస్సెన్ 129, టెంబా బవుమా 110 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక తదుపరి మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా టీమిండియా గెలుస్తుందోమో చూడాలి.

టీమిండియాతో తొలి వ‌న్డేలో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు బావుమా, వండ‌ర్ డుస్సేన్ రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. నాలుగో వికెట్‌కు 204 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్య‌ధిక భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం. అంత‌కు ముందు సెంచూరియ‌న్‌లో 2013లో డికాక్‌, డివిలియ‌ర్స్ నాలుగో వికెట్‌కు 171 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అంతే కాకుండా ఇది ఓవ‌రాల్‌గా రెండో అత్య‌ధిక భాగ‌స్వామ్యం కూడా.

భారత యువ క్రికెట్ జట్టులో కరోనా కలకలం, కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా

అంత‌కుముందు 2000లో కోచి వేదిక‌గా తొలి వికెట్‌కు కిర్ట్‌సెన్ - గిబ్స్‌ 235 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 296 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు బావుమా(110), వండ‌ర్ డుస్సేన్(129) సెంచ‌రీల‌తో చెల‌రేగారు. భార‌త బౌల‌ర్లలో బుమ్రా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.