IND vs SA 1st Test 2021: సఫారీలకు చుక్కలు చూపించిన షమీ, తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా, భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం

బ్యాటింగ్‌ వైఫల్యంతో సఫారీ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది.

Mohammad Shami (Photo Credits: Twitter/ICC)

పేసర్‌ మొహమ్మద్‌ షమీ (5/44) పదునైన బౌలింగ్‌కు తోడు ఇతర పేసర్లు కూడా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో (IND vs SA 1st Test 2021) భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో సఫారీ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తెంబా బవుమా (52; 10 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

బుమ్రా, శార్దుల్‌ చెరో 2 వికెట్లు తీయగా, సిరాజ్‌కు ఒక వికెట్‌ దక్కింది. అంతకుముందు 272/3తో ఆట కొనసాగించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (260 బంతుల్లో 123; 17 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఎన్‌గిడి (6/71) భారత్‌ను దెబ్బ తీశాడు. మ్యాచ్‌ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్‌ (4) వికెట్‌ కోల్పోయి 16 పరుగులు చేసింది. రాహుల్‌ (5), శార్దుల్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. అనంతరం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ 20 ఓవర్లు ముగిసే సరికి 50/2 (20) పరుగులు చేసింది. రబడ బౌలింగ్‌లో మల్దర్‌కు క్యాచ్‌ ఇచ్చి శార్దూల్‌ ఠాకూర్‌ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌, ఛతేశ్వర్‌ పుజారా క్రీజులో ఉన్నారు.



సంబంధిత వార్తలు

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif