IND vs SA 2021–22: మూడో టెస్టుకు ముందే టీమిండియాకు షాక్, పేస్‌బౌలర్ సిరాజ్ అందుబాటులోకి రావడం కష్టమేనన్న ద్రావిడ్, కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

India Beat South Africa By 113 Runs,

దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ ఓటమి నుంచి కోలుకోక ముందే భారత్‌కు మూడో టెస్టుకు ముందే (IND vs SA 2021–22) మరో భారీ షాక్‌ తగలనుంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్‌ ఇంకా కోలుకోలేన‌ట్లు సమాచారం. ఈ క్రమంలో రెండో టెస్ట్‌ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. సిరాజ్ గాయంపై అప్‌డేట్ అందించాడు.

సిరాజ్‌తో నెట్స్‌లో కష్టపడాలి. హామ్ స్ట్రింగ్ గాయం నుంచి వెంటనే కోలుకోవడం చాలా కష్టం. మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతో సిరాజ్‌ దూరం కావడం మాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. అతడు గాయపడినప్పటికీ మూడో రోజు బౌలింగ్‌కు వచ్చాడు. ఒక వేళ కెప్‌టౌన్‌ టెస్ట్‌కు సిరాజ్‌ దూరమైతే (Mohammed Siraj doubtful in Cape Town), ఉమేష్, ఇషాంత్ రూపంలో మాకు మంచి బెంచ్ బలం ఉంది అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఇక కేప్ టౌన్‌లో జరిగే 3వ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ( Rahul Dravid confirms ‘Virat Kohli set to return for 3rd Test) తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని రాహుల్ ద్రవిడ్ ధృవీకరించారు.

టీమిండియాను కాపాడలేకపోయిన వరుణుడు, రెండో టెస్టులో ఓటమి, 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘనవిజయం

జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో భారత్ 3వ టెస్టు ఆడనుంది, గాయం నుంచి కోలుకోవడానికి అతనికి 4 రోజుల సమయం మాత్రమే ఉంది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 2వ రోజున మొహమ్మద్ సిరాజ్ కేవలం 15 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతను బౌలింగ్ చేసిన ఆ 15 ఓవర్లలో అతను తన పేస్ కోల్పోయాడు. ఇక జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌1-1తో సమమైం‍ది.

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం

జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 3 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1 ప్రోటిస్‌ సమం చేసింది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరగనున్న మూడు టెస్ట్‌ ఇరు జట్లుకు కీలకం కానుంది. అయితే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ సాధించని భారత్‌కు ఇది సువర్ణ అవకాశం. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే గాయం కారణంగా రోహిత్‌ శర్మ సౌతాఫ్రికా పర్యటనకు దూరం కాగా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్‌ నుంచి తప్పుకున్నాడు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif