IND vs SA 2nd Test 2023: రెండో టెస్టులో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసిన రోహిత్ సేన, చెలరేగిన భారత బౌలర్లు
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సఫారీలతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా పర్యటన (SA vs IND)ను టీమ్‌ఇండియా ఘన విజయంతో ముగించింది. న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సఫారీలతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 55 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను టీమ్‌ఇండియా 176 పరుగులకు కట్టడి చేసింది.
79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి గెలుపొందింది.యశస్వి జైస్వాల్ (28; 23 బంతుల్లో 6 ఫోర్లు), రోహిత్ శర్మ (17*; 22 బంతుల్లో 2 ఫోర్లు), విరాట్ కోహ్లీ (12), శుభ్‌మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (4*) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత్ గెలుపులో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.