సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది.సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) భారీ విజయం సాధించింది. పేసర్లు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగులతో టీమిండియా(Team India)పై గెలుపొందింది.163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సేన 133 పరుగులకే కుప్పకూలింది.
విరాట్ కోహ్లీ(76) ఒంటరి పోరాటం చేసినా ఇన్నింగ్స్ ఓటమి తప్పించలేకపోయాడు. జాన్‌సెన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన కోహ్లీ.. బౌండరీ వద్ద రబాడ చేతికి చిక్కాడు. దాంతో ప్రొటిస్ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అరంగేట్రంలోనే బర్గర్ 7 వికెట్లతో మెరవగా.. రబడ కూడా ఏడు వికెట్లతో సత్తా చాటాడు.
Here's News
That's that from the Test at Centurion.
South Africa win by an innings and 32 runs, lead the series 1-0.
Scorecard - https://t.co/032B8Fmvt4 #SAvIND pic.twitter.com/Sd7hJSxqGK
— BCCI (@BCCI) December 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)