IND vs SL 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఓటమి, ఆల్ రౌండ్ షోతో మూడు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా సూర్యకుమార్, 2-1తో సీరిస్ భారత్ కైవసం
శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్ మాత్రం 2-1తో శిఖర్ ధవన్ సేన గెలుచుకుంది.
మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్ మాత్రం 2-1తో శిఖర్ ధవన్ సేన గెలుచుకుంది. ముందుగా భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీ షా (49), సంజూ శాంసన్ (46) బంతికో పరుగు చొప్పున బాదారు. దీంతో రెండో వికెట్‌కు 74 రన్స్ జత చేరాయి. ఓ దశలో 157/3తో పటిష్టంగానే కనిపించినా.. స్పిన్నర్లు అఖిల ధనంజయ (3/44), జయవిక్రమ (3/59) ధాటికి మిడిలార్డర్ దెబ్బతింది.
ఈ సమయంలో సూర్యకుమార్ (40) నిలకడ చూపాడు. ఛేదనలో లంక 39 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (76), రాజపక్స (65) రెండో వికెట్‌కు 109 పరుగుల భారీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. రాహుల్ చాహర్‌కు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా సూర్యకుమార్ నిలిచారు. భారత్ నుంచి శాంసన్, రాహుల్ చాహర్, నితీశ్ రాణా, క్రిష్ణప్ప గౌతమ్, సకారియా వన్డే అరంగేట్రం చేశారు.
అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన లంక అవిష్క ఫెర్నాండో (76), రాజపక్స (65) రాణించడంతో లక్ష్యాన్ని (డ/లూ పద్ధతిలో 227) శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్ చాహర్ మూడు వికెట్లు చేజిక్కించుకోగా.. సకారియా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం ఆరంభమవుతుంది.
దీపక్ బ్యాటింగ్ మ్యాజిక్, శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
స్కోరుబోర్డు: భారత్: పృథ్వీ షా (ఎల్బీ) షనక 49; ధవన్ (సి) భనుక (బి) చమీర 13; శాంసన్ (సి) ఫెర్నాండో (బి) జయవిక్రమ 46; మనీశ్ పాండే (సి) భనుక (బి) జయవిక్రమ 11; సూర్యకుమార్ (ఎల్బీ) అఖిల 40; హార్దిక్ (ఎల్బీ) జయవిక్రమ 19; నితీశ్ రాణా (సి) భనుక (బి) అఖిల 7; క్రిష్ణప్ప గౌతమ్ (ఎల్బీ) అఖిల 2; రాహుల్ చాహర్ (సి అండ్ బి) కరుణరత్నె 13; సైనీ (సి) అవిష్క (బి) చమీర 15; సకారియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 43.1 ఓవర్లలో 225. వికెట్ల పతనం: 1-28, 2-102, 3-118, 4-157, 5-179, 6-190, 7-194, 8-195, 9-224, 10-225. బౌలింగ్: చమీర 8.1-0-55-2; అఖిల 10-0-44-3; కరుణరత్నె 6-0-25-1; జయవిక్రమ 10-0-59-3; షనక 8-0-33-1; మెండిస్ 1-0-8-0.
శ్రీలంక: ఫెర్నాండో (సి) పృథ్వీ షా (బి) రాహుల్ చాహర్ 76; భనుక (సి) సకారియా (బి) గౌతమ్ 7; రాజపక్స (సి) గౌతమ్ (బి) సకారియా 65; ధనంజయ డిసిల్వ (సి అండ్ బి) సకారియా 2; అసలంక (ఎల్బీ) హార్దిక్ 24; షనక (సి) మనీశ్ షాండే (బి) చాహర్ 0; మెండిస్ (నాటౌట్) 15; కరుణరత్నె (స్టంప్) శాంసన్ (బి) రాహుల్ చాహర్ 3; అఖిల (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం: 39 ఓవర్లలో 227/7. వికెట్ల పతనం: 1-35, 2-144, 3-151, 4-194, 5-195, 6-214, 7-220. బౌలింగ్: సైనీ 5-0-27-0; సకారియా 8-0-34-2; రాహుల్ చాహర్ 10-0-54-3; గౌతమ్ 8-0-49-1; హార్దిక్ 5-0-43-1; రాణా 3-0-10-0.