Fight Breaks Out in Charity Match (Photo-Video Grab)

క్రికెట్ మ్యాచ్ అంటేనే స్పిరిట్ తో కూడుకున్నది. గెలుపైనా ఓటమైనా హుందాగా స్వీకరించాలి. అయితే ఇక్కడ అలాంటిదేమి జరగలేదు. ఏకంగా బ్యాట్లతో దాడి (Fight Breaks Out in Charity Match) చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ బ్యాట్‌లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని (Charity cricket match) మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్ చివరికి రక్తపాతంతో తడిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గొడవకి కారణం ఏంటనే విషయం వెలుగులోకి రాలేదు.

దీపక్  బ్యాటింగ్ మ్యాజిక్, శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, ఈనెల 23న చివరిదైన మూడో వన్డే

ట్విట్టర్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాంతో.. ఇరుజట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగినట్లు స్పష్టమవుతోంది. అనంతరం రెండు గ్రూప్‌ల ఆటగాళ్లు బ్యాట్‌లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గొడవ సద్దుమణిగే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకి తాళలేక కిందపడిపోయి కనిపించారు. దీంతో మ్యాచ్‌ అర్ధంతరంగా రద్దైంది.

Here's Fight Breaks Out in Charity Match Video

కాగా, ఈ గొడవ విషయమై మ్యాచ్‌ నిర్వహకుడు షెహజాద్‌ (Shehzad Akram) స్పందిస్తూ.. ఇది ఫైనల్ మ్యాచ్‌ అని, మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న దశలో కొందరు గ్రౌండ్‌లోకి వచ్చి గొడవ స్టార్ట్ చేశారని, ఓ ఇద్దరు ముగ్గురు బ్యాట్‌లతో ఆటగాళ్లని తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నాడు. మొత్తంగా ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని నాశనం చేశారని నిరాశ వ్యక్తం చేశాడు. అయితే గొడవకు అసలు కారణం ఏంటన్నది తనకు కూడా తెలియదని అతను చెప్పడం విశేషం.