Deepak Chahar (Photo Credits: @BCCI/Twitter)

మంగళవారం జరిగిన రెండో వన్డేలో (India vs Sri Lanka 2nd ODI 2021) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ చాహర్‌ (82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 నాటౌట్‌) క్రీజులో నిలిచిన తీరు అబ్బురపరిచింది. అతడి ఆటతీరుతో శ్రీలంకపై (India vs Sri Lanka) భారత జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్‌ (3/50), భువనేశ్వర్‌ (3/54), దీపక్‌ చహర్‌ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.

లక్ష్య ఛేదనను భారత్‌ పేలవంగా ఆరంభించింది. తొలి వన్డే హీరోలు పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1), శిఖర్‌ ధావన్‌ (29; 6 ఫోర్లు) త్వరగా పెవిలియన్‌కు చేరారు. ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను పాండే, సూర్యకుమార్‌ తీసుకోగా ఇద్దరు త్వరగానే పెవిలియన్ చేరారు. అదే ఓవర్‌లో హార్దిక్‌ (0) కూడా అవుటవ్వడంతో భారత్‌ 116 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో సూర్యకుమార్, కృనాల్‌ ఉండటంతో భారత్‌ గెలుపు ధీమా ఉన్నా ఇద్దరూ అవుట్ కావడంతో గెలుపు మీద ఆశలు సన్నగిల్లాయి.

ఔరా..తొలి బంతికే సిక్స్, ఆడిన తొలి మ్యాచ్‌లో అదరహో అనిపించిన ఇషాన్‌ కిషన్‌, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం

ఎనిమిదో నంబర్‌లో వచ్చిన దీపక్‌ భువనేశ్వర్‌ (19 నాటౌట్‌; 2 ఫోర్లు) సాయంతో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. సందకన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన దీపక్‌... ఆ తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమం లో 64 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. కండరాలు పట్టేయడంతో చికిత్స తీసుకున్న దీపక్‌ నొప్పిని భరిస్తూనే ఫోర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అజేయమైన 8వ వికెట్‌కు భువనేశ్వర్‌తో కలిసి దీపక్‌ (Deepak Chahar Shines) 84 పరుగులు జోడించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) నిలిచాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది.

స్కోరు వివరాలు

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 50; భానుక (సి) మనీశ్‌ (బి) చహల్‌ 36; రాజపక్స (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) చహల్‌ 0; ధనంజయ (సి) ధావన్‌ (బి) చహర్‌ 32; చరిత్‌ అసలంక (సి) (సబ్‌) పడిక్కల్‌ (బి) భువనేశ్వర్‌ 65; షనక (బి) చహల్‌ 16; హసరంగ (బి) చహర్‌ 8; కరుణరత్నే (నాటౌట్‌) 44; చమీర (సి) (సబ్‌) పడిక్కల్‌ (బి) భువనేశ్వర్‌ 2; సందకన్‌ (రనౌట్‌) 0; కసున్‌ రజిత (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 275.

వికెట్ల పతనం: 1–77, 2–77, 3–124, 4–134, 5–172, 6–194, 7–244, 8–264, 9–266.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10–0– 54–3, దీపక్‌ చహర్‌ 8–0–53–2, హార్దిక్‌ 4–0–20–0, చహల్‌ 10–1–50–3, కుల్దీప్‌ 10–0–55–1, కృనాల్‌ 8–0–37–0.

భారత ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) హసరంగ 13; ధావన్‌ (ఎల్బీ) (బి) హసరంగ 29; ఇషాన్‌ (బి) రజిత 1; పాండే (రనౌట్‌) 37; సూర్యకుమార్‌ (ఎల్బీ) (బి) సందకన్‌ 53; హార్దిక్‌ (సి) ధనంజయ (బి) షనక 0; కృనాల్‌ (బి) హసరంగ 35; దీపక్‌ చహర్‌ (నాటౌట్‌) 69; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (49.1 ఓవర్లలో 7 వికెట్లకు) 277. వికెట్ల

పతనం: 1–28, 2–39, 3–65, 4–115, 5–116, 6–160, 7–193.

బౌలింగ్‌: రజిత 7.1–0–53–1, చమీర 10–0–65–0, హసరంగ 10–0–37–3, సందకన్‌ 10–0–71–1, కరుణరత్నే 6–1–26–0, షనక 3–0–10–1, ధనంజయ 3–0–10–0.