IND vs ZIM 2nd ODI: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన జింబాంబ్వే, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్, మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో సీరిస్ కైవసం

తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది.

Indian players celebrate a wicket (left) and Sanju Samson with his Player of the Match trophy (Photo credit: Twitter)

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌(33),గిల్‌(33) పరుగులతో రాణించారు. కాగా స్టాండింగ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో జాంగ్వే రెండు వికెట్లు పడగొట్టగా.. చివంగా, రజా, న్యాచీ తలా వికెట్‌ తీశారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే మరోసారి తక్కువ స్కోరుకే ఆలౌటైంది. కనీసం రెండు వందల పరుగుల మార్క్‌ను కూడా అందుకోవడంలో విఫలమైన జింబాబ్వే పూర్తి ఓవర్లు ఆడకుండానే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్‌ అయింది. సీన్‌ విలియమ్స్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. రియాన్‌ బర్ల్‌ 39 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. మిగతావారిలో ఎవరు పెద్దగా రాణించలేదు. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీయగా.. సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దీపక్‌ హుడా తలా ఒక వికెట్‌ తీశారు. ఇరు జట్లు మధ్య అఖరి వన్డే ఆగస్టు 22న హరారే వేదికగా జరగనుంది.

ధావన్‌, గిల్‌ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

ఇక జింబాబ్వే టీమిండియాపై ఒక చెత్త రికార్డును మూట గట్టుకుంది. వరుసగా ఐదు వన్డేల్లో 200 కంటే తక్కువస్కోర్లు నమోదు చేసింది. ఇందులో రెండుసార్లు(34.3 ఓవర్లలో 126 పరుగులు, 42.2 ఓవర్లలో 123 పరుగులు)150 పరుగుల మాక్క్‌ను దాటని జింబాబ్వే.. మరో మూడు సార్లు 200 కంటే తక్కువ స్కోర్లు(49.5 ఓవర్లలో 168 ఆలౌట్‌, 40.3 ఓవర్లలో 189 పరుగులు).. తాజాగా 161 పరుగులు చేసింది.



సంబంధిత వార్తలు

Paidi Rakesh Reddy: మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్, మతిస్థిమితం లేకుండా తాగే పిచ్చి ఎంకడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif