Ind Vs Zim 3rd ODI: చివరి మ్యాచ్ లో జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమ.. అయినా విజయం దక్కలేదు

పోరాడి ఓడిన జింబాబ్వే!

BCCI (Image Credits: BCCI)

New Delhi, August 22: హరారే వేదికగా భారత్‌తో (India) జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే(Zimbabwe) మరోసారి ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. అయితే, జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. బ్యాటర్‌ సికిందర్‌ రజా (115)  సెంచరీ సాధించి ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.

అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన జింబాంబ్వే, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్, మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో సీరిస్ కైవసం

9 బంతుల్లో 15 పరుగులు కావల్సిన నేపథ్యంలో రజా ఔట్‌ కావడంతో భారత విజయం లాంఛనమైంది. 290 పరుగుల లక్ష్యంతో (Target) బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది.. తద్వారా భారత్‌ చేతిలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.