2020 Under-19 Cricket World Cup: 5వసారి ప్రపంచకప్ కొట్టేందుకు భారత్ జట్టు రెడీ, అండర్- 19 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, హైదరాబాద్ నుంచి తిలక్ వర్మకి చోటు, కెప్టెన్‌గా ప్రియం గార్గ్
దక్షిణాఫ్రికా(South Africa)లో అండర్- 19 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు(India Team)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది.
New Delhi, December 2: జనవరి 17 నుంచి ఆరంభం కానున్న అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ (Under-19 Cricket World Cup) కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికా(South Africa)లో అండర్- 19 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు(India Team)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మన్ ప్రియం గార్గ్ (Uttar Pradesh's Priyam Garg) నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్- ఏలో భారత్‌తో పాటుగా జపాన్(Japan), న్యూజిలాండ్(New Zealand ), శ్రీలంక (Srilanka) క్రికెట్ జట్లు ప్రత్యర్థి జట్లతో తలపడనున్నాయి. కాగా ఫిబ్రవరి 9న పోచెఫ్‌స్ట్రూంలో ప్రపంచకప్- 2020 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
వైస్ కెప్టెన్‌గా ధ్రువ్ చంద్ జురెల్ (Dhruv Chand Jurel)భాద్యతలు నిర్వర్తించనున్నాడు. ధ్రువ్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. ధ్రువ్‌తో పాటు కుమాల్ కుషాగ్ర(Kumal Kushagra) కూడా జట్టులో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ జట్టులో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకి చోటు దక్కింది. తిలక్ (Hyderabad's Tilak Varma)జట్టులో ప్రముఖ బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు. తిలక్‌తో పాటు యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా, శషావత్ రావత్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు.
BCCI Tweet
అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆనాటి అండర్-19 జట్టు భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టింది.ఈ క్రమంలోనే ఐదవసారి ప్రపంచకప్ కొట్టాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది.
ప్రపంచకప్-2020 అండర్-19 భారత జట్టు:
ప్రియం గార్గ్(కెప్టెన్), ధ్రువ్ జరేల్(వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, శశ్వత్ రావత్, దివ్యాంగ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయి, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుషాగ్ర(వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్