India vs South Africa, 2nd T20I: రెండో టీ-20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ, డేవిడ్ మిల్లర్ సెంచరీ వృథా, రాణించిన ముగ్గురు టీమిండియ బ్యాట్స్‌మెన్, మరోసారి ఫామ్‌ నిరూపించుకున్న కోహ్లీ, స్వదేశంలో వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన టీమిండియా

నిర్ణీత 20 ఓవర్లలో సఫారీ జట్టు 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికాపై భారత్ (IND Vs SA) గెలిచిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.

Image Source: ICC

Guwahathi, OCT 02: భారత్‌తో (India) జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా ( South Africa) జట్టు పోరాడి ఓడింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. సఫారీ బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar yadav) (61), కేఎల్ రాహుల్ (KL Rahul) (57), విరాట్ కోహ్లీ (Virat kohli) (49 నాటౌట్) రాణించారు. దీంతో భారత జట్టు 237/3 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో సఫారీ బ్యాటర్లు తడబడ్డారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (0), రైలీ రూసో (0) ఇద్దరూ రెండో ఓవర్లోనే డకౌట్లుగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కాసేపు ధాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్రమ్ (33)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో క్వింటన్ డీకాక్ (69 నాటౌట్)కు జత కలిసిన డేవిడ్ మిల్లర్ (David miller) (47 బంతుల్లో 106 నాటౌట్) ఆ జట్టును గెలిపించినంత పనిచేశాడు.

అయితే భారత బౌలర్లు కొంత కట్టడి చేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో సఫారీ జట్టు 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికాపై భారత్ (IND Vs SA) గెలిచిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.

Snake Found on Field: ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్‌లో పాము కలకలం, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఫీల్డ్‌లోకి పాము, పరుగులు పెట్టిన సౌతాఫ్రికా ఫీల్డర్లు, కాసేపు నిలిచిన మ్యాచ్‌ 

అంతేకాదు, స్వదేశంలో వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. స్వదేశంలో ఇది భారత్‌కు వరుసగా 10వ సిరీస్ విజయం. ఆ తర్వాత 7 సిరీస్‌ విజయాలతో ఆసీస్ రెండో స్థానంలో ఉంది.



సంబంధిత వార్తలు

Paidi Rakesh Reddy: మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్, మతిస్థిమితం లేకుండా తాగే పిచ్చి ఎంకడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్

Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో, స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు, అనుచరులు అలర్ట్ కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సుఖ్ బీర్ సింగ్ బాదల్

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif