India's Squad For Sri Lanka ODIs and T20Is Announced: శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఇదే! టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, రెండు, వన్డే, టీ-20 లకు వైస్ కెప్టెన్ గా గిల్
యువ పేసర్ హర్షిత్ రాణా కు వన్డే జట్టులో అవకాశం దక్కింది. వ్యక్తిగత కారణాలతో హార్దిక్ పాండ్యా కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాడు
New Delhi, July 18: శ్రీలంక పర్యటనకు (Team India Sri Lanka Tour) భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే సూర్యకుమార్ యాదవ్‌ను (Surya Kumar Yadav) టీ20 కెప్టెన్‌గా నియమించింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీలు Virat Kohli) వన్డేలకు అందుబాటులోకి వచ్చారు. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మనే కొనసాగనున్నాడు. ఇక ఆశ్చర్యకరంగా గిల్ ను రెండు ఫార్మాట్లకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఐ. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్‌లు వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ లు కేవలం టీ20 జట్టులోనే చోటు దక్కించుకున్నారు. రిషబ్ పంత్ రెండు ఫార్మాట్లలో ఆడనున్నాడు. మరోవైపు జింబాబ్వేలో సెంచరీ సాధించిన అభిషేక్ శర్మను పట్టించుకోలేదు.
లంక పర్యటనకు భారత టీ20 జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
లంక పర్యటనకు భారత వన్డే జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.