IND Vs AUS T20: నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20.. సాయంత్రం 7.00 నుంచి మ్యాచ్.. ఆటకు వరణుడి ముప్పు??
అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. వైజాగ్ లో రికార్డు స్కోరు చేజ్ చేసిన యువభారత జట్టు.. నేడు తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.
Newdelhi, Nov 26: వన్డే ప్రపంచ కప్ (World Cup) ఫైనల్ (Final) ఓటమి అనంతరం ఆడిన తొలి టీ20లో (T20) విజయం సాధించిన టీమ్‌ఇండియా (Team India).. అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. వైజాగ్ లో రికార్డు స్కోరు చేజ్ చేసిన యువభారత జట్టు.. నేడు తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది. బ్యాటింగ్ లో జట్టుకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. బౌలింగ్ లో మరింత రాణించాలని భారత్ భావిస్తుంటే.. సిరీస్ సమం చేయాలని కంగారూలు కాచుకు కూర్చున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కేరళపై అధికంగా ఉండటంతో.. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
పిచ్, వాతావరణం
ఈ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేయడం కష్టం. ఇక్కడ జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల్లో చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది. ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, రుతురాజ్, ఇషాన్, తిలక్, రింకూ, అక్షర్, రవి, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, ముఖేశ్.
ఆస్ట్రేలియా: వేడ్ (కెప్టెన్), స్మిత్, షార్ట్, ఇంగ్లిస్, స్టొయినిస్, డేవిడ్, హార్డీ, అబాట్, ఎలీస్, బెరన్‌డార్ఫ్, తన్వీర్.