India vs England 1st Test 2021: తడబడుతున్న ఇండియా, 56 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసిన టీం ఇండియా, కొనసాగుతున్న బ్యాటింగ్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్

సాయంత్రం నాలుగు గంటల సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్సులో 56 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 225 పరుగులు (India vs England 1st Test 2021) చేసింది.

Joe Root Takes Stunning One-Handed Catch (Photo Credits: Twitter)

చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్సులో 56 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 225 పరుగులు (India vs England 1st Test 2021) చేసింది.

కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును పుజరా, పంత్ ఆదుకున్నారు. పుజారా ఆచితూచి ఆడుతూ 143 బంతుల్లో 73 పరుగులు చేయగా, పంత్ ... సిక్సులు, ఫోర్లతో స్కోర్ బోర్డును దూకుడుగా ఆడారు. కేవలం 88 బంతుల్లో 91 పరుగులు చేసి ఆరవ వికెట్ గా వెనుదిరిగాడు.కేవలం 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 578 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు మరో 23 రన్స్‎ను జోడించి రెండు వికెట్లను కోల్పోయింది. బ్రుమా బౌలింగ్‎లో డొమ్ బెస్ (34) ఔట్ కావడంతో తర్వాత వచ్చిన అండర్సన్ అశ్విన్ బౌలింగ్‎లో ఒక పరుగు చేసి వెనుతిరిగాడు.

ధోనీ సరికొత్త రికార్డు, ఐపీఎల్‌లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన మహేంద్రుడు, రూ.146.6 కోట్లతో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

దీంతో ఇంగ్లండ్ జట్టు 190.1 ఓవర్‎లో 578 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం రోజున ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ 218, స్టోక్స్ 82 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. భారత్ బౌలింగ్‎లో బుమ్రా, అశ్విన్ మూడు వికెట్లు తీయగా..నదీమ్, ఇషాంత్ లకు రెండు వికెట్లు దక్కాయి.

జీవం లేని పిచ్‌పై కెప్టెన్‌ జో రూట్‌ (377 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 218) అద్భుత ఆటతీరుతో ఊహించినట్టుగానే డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు బెన్‌ స్టోక్స్‌ (118 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) అర్ధసెంచరీతో మెరిశాడు. అలాగే పోప్‌ 34, డొమినిక్‌ 34, బర్న్స్‌ 33, బట్లర్‌ 30 పరుగులతో రాణించారు.