IND vs NZ T20I: టీమిండియా క్లీన్ స్వీప్, ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టిన కివీస్, కివీస్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసిన జట్టుగా భారత్ రికార్డు
పటిష్టమైన భారత బౌలింగ్, దుర్భేద్యమైన భారత్ బ్యాటింగ్ దెబ్బకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టింది. టీ20లో ఆది నుంచి దుమ్మురేపుతూ వచ్చిన భారత్ చివరి మ్యాచ్ లో(India vs New Zealand 5th T20I 2020) కూడా విజయం సాధించి సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా కివీస్ గడ్డపై తొలిసారి ఒక టీ20 సిరీస్‌ను (India vs New Zealand T20I) క్వీన్‌స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది.
Mount Maunganui, Febuary 2: ఇండియా (India) దెబ్బకు న్యూజీలాండ్ (New Zealand) కథ కంచికి చేరింది. పటిష్టమైన భారత బౌలింగ్, దుర్భేద్యమైన భారత్ బ్యాటింగ్ దెబ్బకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టింది. టీ20లో ఆది నుంచి దుమ్మురేపుతూ వచ్చిన భారత్ చివరి మ్యాచ్ లో(India vs New Zealand 5th T20I 2020) కూడా విజయం సాధించి సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా కివీస్ గడ్డపై తొలిసారి ఒక టీ20 సిరీస్‌ను (India vs New Zealand T20I) క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ బ్యాటింగ్‌లో సీఫెర్ట్(50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాస్ టేలర్(53; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేసినా మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు.
సూపర్ ఓవర్లో మళ్లీ టీమిండియాదే గెలుపు
భారత్ నిర్దేశించిన 164 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గప్టిల్(2), మున్రో(15), టామ్ బ్రూస్(0)లు నిరాశపరచగా, ఆ తర్వాతే క్రీజులోకి వచ్చిన టేలర్-సీఫెర్ట్ మ్యాచ్ మొత్తాన్ని తమ వైపుకు లాక్కున్నారు.
మూడో టీ20 లోనూ టీమిండియా అద్భుత విజయం
ఇద్దరూ భారత్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే 30 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ సాధించగా, తన కెరీర్‌లో వందో టీ20 ఆడుతున్న టేలర్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 97 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ప్రధానంగా శివం దూబే వేసిన ఒక ఓవర్‌లో 34 పరుగులు జోడించడంతో కివీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.
10 ఓవర్ తొలి రెండు బంతుల్ని సీఫెర్ట్ సిక్స్‌లుగా మలచగా, మూడో బంతికి ఫోర్, నాల్గో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఐదో బంతి నో బాల్ కాగా, దానికి ఫోర్ వచ్చింది. దాంతో ఎక్స్‌ట్రా పరుగు, బంతి కూడా వచ్చింది. దాంతో ఫ్రీ హిట్‌ను సిక్స్ కొట్టిన టేలర్.. ఆఖరి బంతికి కూడా సిక్స్ తో ముగింపు ఇచ్చాడు.(ఇక్కడ చదవండి: శాంసన్.. మైండ్ బ్లోయింగ్ ఫీల్డింగ్!)
అయితే ఈ జంటను భారత్ బౌలర్లు ఎట్టకేలకు విడగొట్టడంతో కివీస్ ఒత్తిడిలో పడింది. ఆపై వరుసగా న్యూజిలాండ్ వికెట్లు కోల్పోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక శార్దూల్ వేసిన చివరి ఓవర్‌లో ఇష్ సోధీ(16 నాటౌట్: 10 బంతుల్లో 2 సిక్స్‌లు) రెండు సిక్సర్లు కొట్టినా విజయాన్ని అందించలేకపోయాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సాధించగా, సైనీ, శార్దూల్ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్‌కు వికెట్ దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టులో కేఎల్ రాహుల్(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్ శర్మ(60 రిటైర్డ్ హర్ట్; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్‌లీన రెండు వికెట్లు సాధించగా, బెన్నెట్‌కు వికెట్ లభించింది.