India vs South Africa 1st Test 2021: తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయిన భారత్, మూడో రోజు 55 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయిన టీం ఇండియా

మూడో రోజు తొలి సెషన్ లోపే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులకు (Team India all out for 327 runs ) ఆలౌట్ అయింది. నిన్న వర్షం కారణంగా రెండో రోజు ఆట (India vs South Africa 1st Test 2021) రద్దయిన సంగతి విదితమే.

KL Rahul (Photo Credits: Twitter)

దక్షిణాఫ్రికా- భారత్‌ మధ్య తొలి టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. మూడో రోజు తొలి సెషన్ లోపే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులకు (Team India all out for 327 runs ) ఆలౌట్ అయింది. నిన్న వర్షం కారణంగా రెండో రోజు ఆట (India vs South Africa 1st Test 2021) రద్దయిన సంగతి విదితమే. తేమతో ఉన్న పిచ్ ఉపయోగించుకున్న సఫారీలు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 272/3 పటిష్ఠ స్థితిలో ఉన్న టీమ్ ఇండియా ఇంకో 55 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ ఎంగిడి 6/71తో భారత బ్యాటర్లను వణికించాడు,

తొలి రోజు శతకంతో చెలరేగిన కెఎల్ రాహుల్ (123) మరో పన్నెండు బంతులు ఆడి ఒకే పరుగు చేశాడు. రబాడ బౌలింగ్ లో ఔటయ్యాడు. అజింక్యా రహానే కుదురుకున్నట్లు కనిపించినా అర్థ శతకానికి రెండు పరుగుల దూరంలో 48 వద్ద ఔటై పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన భారత్ బ్యాటర్లు ఏ ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. రిషబ్ పంత్ 8, రవిచంద్ర అశ్విన్ 4, శార్దూల్ ఠాకూర్ 4, షమీ 8, బుమ్రా 14, సిరాజ్ 4 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 6, రబాడ 3, జాన్ సన్ ఒక వికెట్ పడగొట్టారు.

రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక సౌరవ్‌ గంగూలీకి కరోనా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బీసీసీఐ వర్గాలు

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఏడు ఓవర్లలో సఫారీలు ఒక్క వికెట్ కోల్పోయి 21 పరుగులు చేశారు.



సంబంధిత వార్తలు

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

Mobile Subscriptions in India: దేశంలో 115.12 కోట్లకు చేరుకున్న మొబైల్ సబ్‌స్కైబర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif