India Women Beat New Zealand Women By 59 Runs in 1st ODI 2024; వరల్డ్ ఛాంపియన్స్ కు షాక్ ఇచ్చిన ఉమెన్స్ టీం, తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ, 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ
వరల్డ్ కప్ చాంపియన్ అయిన సోఫీ డెవినె బృందానికి వారం రోజులు గడువక ముందే టీమిండియా (Team India) తొలి ఓటమి రుచి చూపింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాధా యాదవ్(3/35), సైమా థాకూర్(2/26)లు చెలరేగగా భారత్ 56 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
Ahmadabad, OCT 24: టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్‌కు భారత మహిళల జట్టు భారీ షాకిచ్చింది. వరల్డ్ కప్ చాంపియన్ అయిన సోఫీ డెవినె బృందానికి వారం రోజులు గడువక ముందే టీమిండియా (Team India) తొలి ఓటమి రుచి చూపింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాధా యాదవ్(3/35), సైమా థాకూర్(2/26)లు చెలరేగగా భారత్ 56 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్‌కు ఊహించిన ఓటమి ఎదురైంది. ఆల్‌రౌండ్ షోతో భారత జట్టు అదరగొట్టగా కివీస్ ఘోర పరాజయం మూటగట్టకుంది. 228 పరుగుల ఛేదనలో తడబడిన కివీస్ ఆలౌటయ్యింది. భారత బౌరల్లో సైమా థాకూర్(2/26) సంచలన ప్రదర్శనతో న్యూజిలాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించింది. ఆఖర్లో రాధా యాదవ్(3/35) తన స్పిన్ మ్యాజిక్ చూపడంతో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈడెన్ కార్సన్(0) 10వ వికెట్‌గా ఔట్ కావడంతో టీమిండియాకు అద్భుత విజయం సాధించింది.
A winning start to the ODI series in Ahmedabad
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే ఇంటికొచ్చేసిన భారత జట్టు స్వదేశంలో పంజా విసిరింది. మెగా టోర్నీలో తమపై 65 పరుగుల తేడాతో గెలుపొందిన కివీస్‌ను ముప్పతిప్పలు పెట్టింది. తొలుత ఓపెనర్ షఫాలీ వర్మ(33) మెరుపులకు తెజల్ హసబ్నిస్(42), దీప్తి శర్మ(41)ల సాధికారికి ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా 44.3 ఓవర్లో 227 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప ఛేదనలో కివీస్ గెలుపు ఖాయమనుకున్నారంతా. కానీ, అంతా తలకిందులైంది. ఓపెనర్ సుజీ బేట్స్(1)ను సైమా థాకూర్ డగౌట్‌కు చేర్చి కివీస్‌ను ఒత్తిడిలో పడేసింది.
Deepti_Sharma is awarded the Player of the Match award
ఆ తర్వాత జార్జియా ప్లిమ్మర్(25), లారెన్ డౌన్(26)లు జట్టును ఆదుకున్నారు. అయితే.. దీప్తి శర్మ డేంజరస్ ప్లిమ్మెర్‌ను వెనక్కి పంపగా.. డౌన్‌ను రాధా యాదవ్ ఔట్ చేసింది. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో విఫలమైన కెప్టెన్ సోఫీ డెవినె(2) మళ్లీ నిరాశపరుస్తూ రనౌట్ అయింది. 79 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను బ్రూక్ హల్లిడే(39), మ్యాడీ గ్రీన్(31)లు గట్టెక్కించే ప్రయత్నం చేశారు.
కానీ, సైమా బౌలింగ్‌లో మంధాన విసిరిన త్రోకు గ్రీన్ రనౌట్ కాగా.. నాలుగో బంతికి హల్లిడే క్యాచ్ ఇచ్చి డగౌట్ చేరింది. అంతే.. కివీస్ ఓటమి ఖాయమైంది. ఆఖర్లో అమేలియా కేర్(25 నాటౌట్) కాసేపు ప్రతిఘటించినా రాధా యాదవ్ భారత్‌కు విజయాన్ని కట్టబెట్టింది. బ్యాటుతో, బంతితో రాణించిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే అక్టోబర్ 27న ఇదే స్టేడియంలో జరుగనుంది.