T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టు ఇదే, తిరిగి జట్టులోకి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) టీమిండియా జట్టును ప్రకటించింది.ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ (ICC Men’s T20 World Cup 2022 ) కోసం 15 మందితో సోమవారం భారత జట్టును ఎంపిక చేసింది
టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) టీమిండియా జట్టును ప్రకటించింది.ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ (ICC Men’s T20 World Cup 2022 ) కోసం 15 మందితో సోమవారం భారత జట్టును ఎంపిక చేసింది.గాయాల నుంచి కోలుకుంటున్న జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మెగాటోర్నీ నాటికి ఈ ఇద్దరు బౌలర్లు పూర్తి ఫిట్‌నెస్ కోసం జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)లో తిరిగి చేరనున్నారు.
ఒకవేళ టీ20 ప్రపంచకప్ నాటికి హర్షల్ పూర్తి ఫిట్‌నెస్ దక్కించుకోకపోతే యువ బౌలర్ అవేశ్‌ఖాన్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి.టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌సింగ్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. ఆసియాకప్‌లో యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ మెరుగ్గా రాణించినా..సెలెక్టర్లు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ వైపే మొగ్గుచూపారు.
భారత జాతీయ జెండాను రెపరెపలాడించిన షాహిద్ ఆఫ్రీది కూతురు, ఘటనపై క్లారీటి ఇచ్చిన పాకిస్తాన్ క్రికెటర్
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే పెద్దగా మార్పులేమి చేయలేదు. దీపక్ హుడాకు జట్టులో చోటు దక్కగా, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అదనపు ఆటగాళ్లుగా షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ల ద్వారా బౌలింగ్ కూర్పును పరిశీలించనున్నారు. హార్దిక్, అర్ష్‌దీప్‌సింగ్, భువనేశ్వర్ పని ఒత్తిడిని ఎన్‌సీఏలో సమీక్షించనున్నారు.
టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), రాహుల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, కార్తీక్, హార్దిక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌సింగ్. స్టాండ్‌బై: షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, చాహర్.
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు: రోహిత్(కెప్టెన్), రాహుల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, కార్తీక్, హార్దిక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, షమీ, హర్షల్, చాహర్, బుమ్రా
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు: రోహిత్(కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, కార్తీక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌సింగ్, షమీ, హర్షల్ పటేల్, చాహర్, బుమ్రా