IPL 2020 Schedule Announced: సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 3 వరకు ఐపీఎల్ 13, ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్, సెప్టెంబర్ 21న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్
ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తాజా సీజన్ నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2020లో (Indian Premier League 2020) సెప్టెంబర్ 19న ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఐపీఎల్ 2020 వేడుక ప్రారంభానికి ముహూర్తం (IPL 2020 Schedule Announced) కుదిరింది. ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తాజా సీజన్ నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2020లో (Indian Premier League 2020) సెప్టెంబర్ 19న ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 20న దుబాయ్‌లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్, 21న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు, 22న రాజస్థాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, 23న కోల్‌కతా వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఐపీఎల్ జట్లలో అందరికంటే చివరగా మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మైదానంలోకి అడుగు పెట్టింది. ఆరు రోజుల తప్పనిసరి ఐసోలేషన్, ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా సోకిన విఘ్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లోకి వచ్చారు.
IPL 2020 Schedule Announced
ఇదిలా ఉంటే ఐపీఎల్–2020 నుంచి సీనియర్ ఆఫ్‌స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ తప్పుకోవడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ టోర్నీకి అతను దూరమవుతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చినా... శుక్రవారం భజ్జీ దానిని అధికారికంగా ప్రకటించాడు. ‘వ్యక్తిగత కారణాలతో నేను ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం లేదు. కొన్ని రకాల కఠిన పరిస్థితులను ఎదుర్కొం టున్న తరుణంలో నాకు కాస్త ఏకాంతం కావాలి. నేను నా కుటుంబంతో గడప దల్చుకున్నాను. సీఎస్‌కే జట్టు మేనేజ్‌మెంట్ నాకు అన్ని విధాలా అండగా నిలిచింది. ఆ జట్టు ఐపీఎల్‌లో బాగా ఆడాలని కోరుకుంటున్నా, జైహింద్’ అని భజ్జీ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్‌లో ఆరోగ్య భద్రతపై తనకు ఎటువంటి భయాలూ లేవని ఆసీస్ పేసర్, ప్రస్తుత కోల్‌కతా జట్టు ఆటగాడు ప్యాట్ కమిన్స్ చెప్పాడు. కొంతమంది ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ నిర్వహణపై అభిమానుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అలాగే ఆటగాళ్లలో కూడా కరోనా భయాలున్నాయి.
అయితే తనకు మాత్రం అటువంటి ఆలోచనలేవీ లేవని కమిన్స్ స్పష్టంచేశాడు. టోర్నీని రక్షించడం కోసం నిర్వాహకులు చాలా కష్టపడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మామూలు ఐపీఎల్‌తో పోల్చుకుంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ ఆట మాత్రం ఎప్పట్లాగే ఉంటుందని భావిస్తున్నా’ అని కమిన్స్ చెప్పాడు.