
New Delhi, August 29: చెన్నై సూపర్‌కింగ్స్‌ను (Chennai Super Kings) కరోనావైరస్ మహమ్మారి చుట్టేసింది. చెన్నై సహాయక బృంద సభ్యులతో పాటు భారత ఆటగాడు దీపక్ చహర్‌కు కరోనా సోకడం ఇప్పుడు ఆ జట్టులో కలకలం రేపుతోంది. దీంతో ఆటగాళ్లంతా క్వారంటైన్ లోకి (Quarantine) వెళ్లిపోయారు. చెన్నై కోవిడ్ కేసులపై బయటకు తెలిసిపోయినా సదరు ఫ్రాంచైజీ మాత్రం మొదట నోరే మెదపలేదు. అధికారికంగా ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారో తెలియడంలేదు. అనధికార వర్గాల సమాచారం మేరకు 12 మంది కోవిడ్ పాజిటివ్ (12 CSK Squad Members Test Positive) బాధితులున్నట్లు తెలిసింది.
ఒకరు ఆటగాడైతే మిగతావారంతా జట్టు సహాయ సభ్యులేనని ఐపీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పెద్ద సంఖ్యలో బాధితులున్నప్పటికీ ఆటగాడు ఒక్కడే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే ఈ 10 మంది ఇంకెంత మందికి అంటించారోననే బెంగ బీసీసీఐని ఆందోళన పరుస్తోంది. ఈ నేపథ్యంలో ధోని సహా ఆటగాళ్లంతా సెప్టెంబర్ మొదటి వారంలోనే నెట్స్‌కు వెళ్లే అవకాశముంది. కాగా లీగ్ 19న (IPL 2020) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ 11 కంపెనీకి ఐపీఎల్ 13వ సీజన్ హక్కులు, రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న డ్రీమ్ 11
ఇదిలా ఉంటే ఐపీఎల్ టోర్నీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ) ప్రకారం పాజిటివ్ బాధితులంతా వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. అలాగే వాళ్లతో కాంటాక్టు అయిన వ్యక్తుల్ని గుర్తించి వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచాలి. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలతో ఉన్న వారిని బయో సెక్యూర్ నుంచి రెండు వారాల పాటు వెలుపలే వుంచి చికిత్స అందజేస్తారు. ఈ సమయంలో మిగతా ఆటగాళ్లను, ఐపీఎల్, ఫ్రాంచైజీ వర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కలవరాదు. లక్షణాలున్న బాధితుల్ని టోర్నమెంట్ అనుబంధ ఆసుపత్రికి తరలిస్తారు. ఇక లక్షణాలు లేకపోయినా సరే ప్రాక్టీస్‌కు అనుమతించరు. 14 రోజుల పాటు పూర్తిగా గదులకే పరిమితం కావాలి. ఈ ఐసోలేషన్ సమయం పూర్తయ్యాక రెండు సార్లు వరుస పరీక్షల్లో అది కూడా పీసీఆర్ టెస్టుల్లోనే (ర్యాపిడ్ కిట్ టెస్టు కాకుండా) నెగెటివ్ రిపోర్ట్ రావాలి. అప్పుడే బయో సెక్యూర్ లోపలికి తీసుకుంటారు.