N Srinivasan And Suresh Raina (Photo Credit: Twitter)

ఐపీఎల్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సురేశ్‌ రైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) యజమాని ఎన్‌. శ్రీనివాసన్‌ 24 గంటల్లోపే తన మాటలను మార్చుకున్నారు. రైనా గురించి తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, అతనికి ఎప్పుడైనా అండగా నిలుస్తామని చెప్పారు. ‘ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు (Chennai Super Kings) రైనా చేసిన సేవలు అసమానం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. సురేష్ రైనా ( Suresh Raina) మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాలని, మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంటుందని తెలిపారు.

నా వ్యాఖ్యల్లో రైనాను తప్పు పట్టలేదు’ అని శ్రీనివాసన్‌ (N Srinivasan) స్పష్టతనిచ్చారు. మరోవైపు రైనా వెనక్కి రావడంలో ‘హోటల్‌ గది’కి మించిన మరో బలమైన కారణం ఏదైనా ఉండవచ్చని చెన్నై టీమ్‌ సంబంధిత వ్యక్తి ఒకరు వెల్లడించారు. ‘సీఎస్‌కే నిబంధనల ప్రకారం కెప్టెన్, కోచ్, మేనేజర్‌లకు హోటల్‌లో అత్యుత్తమ సౌకర్యాలు ఉన్న గది ఇస్తారు. రైనాకు కూడా ఇలాంటిది ఇచ్చారు. అందులో బాల్కనీ లేకపోవడమనేది మరో అంశం. అయితే ఈమాత్రం దానికే వెనక్కి వచ్చేస్తారా. కరోనా కేసుల భయమే కాకుండా మరో కారణం కూడా ఉండవచ్చు. ఇప్పటికైతే రైనా తిరిగి రాకపోవచ్చు. ఇక చెన్నైతో కూడా ఆట ముగిసినట్లే’ అని ఆయన అభిప్రాయపడ్డారు. క్వారంటైన్‌లో ధోనీ సేన, చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ దీపక్‌ చహర్‌కు కరోనా పాజిటివ్, సెప్టెంబర్‌ మొదటి వారంలో నెట్స్‌కు వెళ్లే అవకాశం

ఐపీఎల్‌ టోర్నీనుంచి రైనా అనుహ్యంగా తప్పుకోవడంపై అనేక అనుమానాలు, పుకార్లు వస్తున్నాయి. కరోనా భయం కారణంగా భారత్‌కు తిరిగి వచ్చాడని కొంతమంది భావిస్తుండగా... కుటుంబ సమస్యలతో తిరుగుముఖం పట్టాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దుబాయ్‌లో రైనాకు కేటాయించిన గది విషయంపై రైనా కొంత అసహనం వ్యక్తం చేశాడని, ఈ క్రమంలోనే జట్టు యజమానికి అతనికి మధ్య స్పల్ప వివాదం ఏర్పడిందని తెలుస్తోంది.

దీంతో పాటు సీఎస్‌కే జట్టు యజమాని ఎన్‌ శ్రీనివాససన్‌..జట్టులో రైనా లేనంతమాత్రనా తమకేమీ న‍ష్టం లేదన్న రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ కారణంగానే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి రైనా తప్పుకుని భారత్‌కు పయనమైనట్లు సమచారం.

ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్న రైనా.. మధ్యలో రెండేళ్లు నిషేధం మినహా అతను 2019 వరకు అదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. చెన్నై తరుఫున 164 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ 4527 పురుగులతో ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్‌ లిస్ట్‌లో తొలిస్థానంలో (లీగ్‌ మొత్తంలో రెండో స్థానం) ఉన్నాడు. టీంలో ధోనీ తరువాత అత్యంత విలువైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. చెన్నై జట్టు అతనికి ప్రస్తుత లీగ్‌లో రూ.11 కోట్లు చెల్లిస్తోంది. రైనా తాజా నిర్ణయంతో ఆ మొత్తాన్ని కోల్పోనున్నాడు.