IPL 2022 Auction: దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా కోసం గట్టి పోటీ, రూ. 9.25 కోట్లు పెట్టి దక్కించుకున్న పంజాబ్ కింగ్స్, రూ. 6.25 కోట్లకు మహ్మద్ షమీని సొంతం చేసుకున్న గుజరాత్
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా (Kagiso Rabada) కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడపై ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.
ఐపీఎల్ మెగా వేలం-2022 (IPL 2022 Auction) ఆరంభమైంది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా (Kagiso Rabada) కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడపై ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.
గుజరాత్ టైటాన్స్ గట్టిపోటి ఇచ్చినప్పటికి.. చివరికి పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లతో రబాడను దక్కించుకుంది. అలాగే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో షమీ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా షమీని ఈసారి వేలంలో రూ. 6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
టీమిండియా యువ ఆటగాడు దేవదూత్ పడిక్కల్‌కు మెగావేలంలో భారీ ధర పలికింది. పడిక్కల్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. రాజస్తాన్ రాయల్స్‌కు రూ. 7.75 కోట్లు వెచ్చించి పడిక్కల్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఆర్‌సీబీకి రూ. 20 లక్షలకు అమ్ముడుపోయిన పడిక్కల్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. కమిన్స్ కనీస ధర రూ. 2 కోట్లు. గతేడాది వేలంలో కేకేఆర్(రూ.15.50 కోట్లు) అత్యధిక ధరకు అమ్ముడైన పాట్ కమిన్స్.. ఈసారి మాత్రం సగానికి పడిపోయాడు. రూ. 7.25 కోట్లతో కమిన్స్‌ను మళ్లీ కేకేఆర్ కొనుగోలు చేసింది.
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేలంలోకి వచ్చాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. బౌల్ట్‌ను దక్కించుకోవడం కోసం రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు బౌల్ట్‌ను దక్కించుకుంది.