IPL 2022 CSK vs KKR: ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టిన కోల్‌కతా, ధోనీ పోరాడినా కూడా చెన్నైకి దక్కని విజయం, దుమ్మురేపిన కోల్‌కతా బౌలర్లు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై (CSK) 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 132 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్ రహానె 44(Rahane) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Mumbai, March 26: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 15వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై (CSK) 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 132 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్ రహానె 44(Rahane) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నితీష్ రానా(21), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(20*), శామ్ బిల్లింగ్స్(25) రాణించారు. చెన్నై బౌలర్లలో బ్రావో(Bravo) మూడు వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

కోల్ కతా ముందు 132 పరుగుల మోస్తరు టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థిని కట్టడి చేశారు. 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సీఎస్కేని మాజీ కెప్టెన్ ధోని (MS Dhoni)ఆదుకున్నాడు. ముఖ్యంగా ధోనీ దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు. ధోనీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో అజేయంగా 50 పరుగులు చేశాడు. అతడికి జడేజా (Jadeja)నుంచి చక్కని సహకారం లభించింది. జడేజా 28 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ జోడీ చివరి 5 ఓవర్లలో 58 పరుగులు రాబట్టడం విశేషం. రసెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి బంతిని జడేజా సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి.

IPL 2022: ఐపీఎల్ తొలి పోరు నేడే, వాఖండే స్టేడియంలో రాత్రి 7. 30 నుంచి తలపడనున్న చెన్నై, కోలకతా, మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో ఈ ఏడాది ఐపీఎల్

ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ధోనీ ధనాధన్ ఆటతీరు ఆవిష్కృతమైంది. జట్టు కష్టాల్లో పడడంతో, పాత ధోనీ కనిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను చివరి ఓవర్లలో ఓ ఆటాడుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఓ దశలో చెన్నై జట్టు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా ఆదుకున్నారు. అంతకుముందు, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. రాబిన్ ఊతప్ప 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. రాయుడు (15) రనౌట్ కాగా, యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే 3 పరుగులు చేశాడు.

IPL 2022: ధోనీ అభిమానులకు షాక్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి వైదొలిగిన ఎంఎస్ ధోనీ, కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 (Umesh Yadav) వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రస్సెల్ 1 వికెట్ తీశారు. గత సీజన్‌ ఫైనల్ పోరులో చెన్నై చేతిలో ఓటమి చవిచూసిన కోల్ కతా నైట్ రైడర్స్.. ఈ సీజన్ లో విక్టరీ కొట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.