IPL Auction 2025 Live

IPL 2022: ఐపీఎల్‌లో ఈ సారి సిక్సర్ల మోత మాములుగా లేదు, ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధింకంగా 896 సిక్సర్లు నమోదు, 1000 సిక్సర్లు నమోదవడం ఖాయమే మరి

క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. బౌలింగ్‌లో అడపాదడపా ప్రదర్శనలు నమోదవుతుంటే.. బ్యాటింగ్‌లో రికార్డులు బద్ధలవుతున్నాయి.ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌ పలు భారీ సిక్సర్ల రికార్డులు కనుమరుగయ్యాయి.

Liam Livingstone

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బ్యాట్సెమెన్ల హవా కొనసాగుతుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. బౌలింగ్‌లో అడపాదడపా ప్రదర్శనలు నమోదవుతుంటే.. బ్యాటింగ్‌లో రికార్డులు బద్ధలవుతున్నాయి.ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌ పలు భారీ సిక్సర్ల రికార్డులు కనుమరుగయ్యాయి.అలాగే, సిక్సర్ల విషయంలో ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌ ఓ ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు (ఢిల్లీ-పంజాబ్‌ మ్యాచ్ వరకు) జరిగిన మ్యాచ్‌ల్లో ఏకంగా 896 సిక్సర్లు నమోదయ్యాయి.

ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో ఇన్ని సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2018లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్‌ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్‌లో ఆ రికార్డు బద్దలైంది. బ్యాటర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ సీజన్‌లో 1000 సిక్సర్లు (IPL 2022 to cross 1000 sixes) నమోదవడం ఖాయంగా కనిపిస్తుంది. 64 మ్యాచ్‌ల్లోనే 896 సిక్సర్లు బాదిన బ్యాటర్లకు మరో 10 మ్యాచ్‌ల్లో (ఫైనల్‌ వరకు) 104 సిక్సర్లు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు.

సీజన్ల వారీగా సిక్సర్ల వివరాలు:

2022 : 896 (అత్యధికం)

2018 : 875

2009 : 506 (అత్యల్పం)

2022 సీజన్‌లో లాంగెస్ట్ సిక్సర్లు:

లివింగ్ స్టోన్ : 117 మీటర్లు

డెవాల్డ్ బ్రెవిస్ : 112 మీటర్లు

లివింగ్ స్టోన్ : 108 మీటర్లు

పూరన్ : 108 మీటర్లు

జోస్ బట్లర్ : 107 మీటర్లు



సంబంధిత వార్తలు